ePaper
Wednesday, May 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడగ్రామాల అభివృద్ధికి ప్రత్యేక అధికారుల బాధ్యతల స్వీకారం

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక అధికారుల బాధ్యతల స్వీకారం

📰 Generate e-Paper Clip

కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 4:

కాజులూరు మండలంలో గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు శనివారం పలు గ్రామాల్లో బాధ్యతలు స్వీకరించారు. అండ్రంగి గ్రామపంచాయతీలో మండల వ్యవసాయ అధికారి వి. అశోక్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి నాగ సుజాత, పంచాయతీ కార్యదర్శి కె.వి. రవి ప్రసాద్, పంచాయతీ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొని వి. అశోక్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే మండల విద్యాశాఖ అధికారి-2 పి. జాన్ జగన్నాథగిరి మరియు తర్లంపూడి గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఇషాంత్ , సంబంధిత గ్రామాల పంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో పారదర్శక పాలన, వేగవంత మైన అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక అధికారులు తమ బాధ్యతలను ప్రారంభించడం గమనార్హం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular