ఇంటూరి సమక్షంలో భారీ చేరికలు 

ఇంటూరి సమక్షంలో భారీ చేరికలు 

 మండలంలో సాగు,తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

స్థానిక వలేటివారిపాలెం చుట్టుపక్కల ప్రతి గ్రామంతోనూ విస్తృత పరిచయాలు ఉన్నాయని చిన్నప్పటినుంచి ఈ ప్రాంతంలోనే తిరిగాను కాబట్టి సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందని తనకు ఓట్లు వేసి గెలిపిస్తే మీరంతా మెచ్చేలా పనిచేస్తానని  కందుకూరు నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. 
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం  మండలంలోని అంకభూపాలపురం, పోలినేనిచెరువు పంచాయతీ పరిధిలోని అంకభూపాలపురం, రామచంద్రాపురం, పోలినేనిచెరువు, అమ్మపాలెం నాగిరెడ్డిపాలెం, వీరన్నపాలెం, గరుకుపాలెం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేస్తూ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనూ నాగేశ్వరరావుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పంచాయతీల్లో తాగు, సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, రాబోయే మన ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతానికి నీటిని తీసుకొచ్చేలా కృషి చేస్తానని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. 
వైసీపీ ప్రభుత్వంలో రోడ్లన్నీ దరిద్రంగా మారాయని చెబుతూ  ప్రధానమైన రోడ్లతోపాటు గ్రామాల మధ్య లింకు రోడ్లు బాగు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో అన్ని గ్రామాల్లో పెద్దఎత్తున సిసి రోడ్లు వేశామని గుర్తు చేశారు. గ్రామాల్లో మౌలిక వస్థలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని నాగేశ్వరరావు చెప్పారు. 
మీరు చూపిస్తున్న అభిమానం మరువలేనిదని, ఈ రెండేళ్లలో సహకరించినట్లుగానే రాబోయే ఎన్నికల్లో తనకు, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. 

 ఇంటూరి సమక్షంలో భారీగా చేరికలు

ఈ సందర్భంగా పోలినేనిచెరువు పంచాయతీకి చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 
పోలినేనిచెరువుకు చెందిన శనివారపు సాంబశివారెడ్డి, యాళ్ల రమణారెడ్డి, గరుకుపాలెం చెందిన లెక్కల కొండారెడ్డి, లెక్కల నరసింహారెడ్డి, చిరిపిరెడ్డి చిన్న పుల్లారెడ్డి ఇంకా పలు కుటుంబాల వారు పార్టీలో చేరారు. అమ్మపాలెం కు చెందిన చల్లగొలుసు మాల్యాద్రి, గజ్జి రమణయ్య, సకిలి దావీదు, డొక్కా పాలకొండయ్య, యోహాను, కొండయ్య, యాకోబు, దావీదు సహా పలువురు పార్టీలో చేరారు. అలాగే వీరన్నపాలెంలో బొమ్మసాని చిన్నఎరుకలయ్య, కొమ్ము తిరుపతయ్య, జయంపు అంజయ్య, ఇంకా పలువురు పసుపు కండవాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, శనివారపు మాల్యాద్రి, స్థానిక నాయకులు పెగడ శ్రీనివాసులు, పెగడ నరసింహం, బక్కమంతల మాల్యాద్రి, ప్రసాదు, పంది లక్ష్మీనారాయణ, చిరిపిరెడ్డి బ్రహ్మారెడ్డి, లింగాలదిన్నె వెంకటరెడ్డి, మంగమూరి నాగయ్య, గజ్జి మాల్యాద్రి, సుందరరావు, బొమ్మిరెడ్డి పెద్దిరెడ్డి, బొమ్మసాని మాల్యాద్రి, సిరిగిరి కొండారెడ్డి, మండల నాయకులు కాకుమాని హర్ష, ఘట్టమనేని లక్ష్మీనరసింహం పరిటాల భాస్కర్, వలేటి నరసింహం, కొంకా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: #news

About The Author