Category
మన్యం / Manyam
జాతీయం / National  ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  మన్యం / Manyam  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  భద్రాద్రి / Bhadradri 

చివరి దశకు నక్సల్స్‌ పోరాట బరి

చివరి దశకు  నక్సల్స్‌ పోరాట బరి ఆధునిక సమాజంలో సమస్యల రూపం సమూలంగా మారిపోయింది. కానీ, అడవుల్లో ఉన్న ఉద్యమ నాయకులు మాత్రం గత భూస్వామ్య, పెట్టుబడీదారి భావజాలంలోనే కొనసాగుతున్నారు. గ్లోబలైజేషన్‌ అడవులకు చేరుకుంటున్న తరుణంలో.. అడవుల్లో గిరిజనులే లేకుండా పోతున్నారు. నక్సలైట్లుగా మారే వాళ్లు తక్కువవుతుంటే.. ఉన్నవారికి లొంగుబాట్లు, కుంగుబాట్లే మిగిలాయి. మహిళల్నీ, బాలికల్ని రిక్రూట్‌ చేసుకుంటున్న పరిస్థితులు పెరిగాయి. దాదాపు రెండు దశాబ్ధాల నుండి నడుస్తున్న ఈ సంక్షోభం ఇప్పుడు పీక్స్‌కు చేరుకుంది.
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  మన్యం / Manyam 

ఆత్మలకు ప్రభుత్వ పథకాలు

ఆత్మలకు ప్రభుత్వ పథకాలు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం  ఆత్మలకు ప్రభుత్వ పథకాలు అని ఆలోచిస్తున్నారా అవునండీ చనిపోయన వారికి పింఛను పంపిణీ చేస్తున్నారు  ఎలా చేస్తున్నారు అని  అనుకుంటున్నారా ? అవునండీ… కురుపాం మండలంలోని 23 పంచాయతీల్లో చనిపోయినవారు కూడా పింఛన్లు అందుకుంటున్నారు..! పింఛన్ల పంపిణీలో సిబ్బంది చేతివాటం ప్రదర్శన వెలుగుచూసింది. కురుపాం మండలంలోని నీలకంఠాపురం పంచాయతీతోపాటు పలు పంచాయతీల్లో మృతి చెందినవారికి కూడా పింఛన్లను పంపిణీ చేసినట్లు రికార్డులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలు, వితంతు, వికలాంగులకు ఆర్థిక సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన పింఛన్లలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్నమాట..! మండలంలోని ఏకంగా 23 పంచాయితీలలో ఈ చేతివాటం జరిగింది. ఇటీవల అధికారులు చేపట్టిన సామాజిక తనిఖీ లో ఈ అక్రమాలను గుర్తించి బహిర్గతం చేశారు.చర్యలు ఏమి తీసుకుంటారో లేకా ప్రభుత్వ పథకాలు అన్ని లోకాల్లో ఇస్తున్నాం అని ప్రచారం చేస్తారో వేచి చూడాలి
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  మన్యం / Manyam 

నిర్లక్ష్యపు నీడలో మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల

నిర్లక్ష్యపు నీడలో మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లో ఉన్న మహాత్మా జ్యోతిబాపులే ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరుగుదల సంక్షేమ గురుకుల విద్యాలయం లో విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు మరోసారి బయటపడింది గతంలో ఇదే స్కూల్లో పాముకాటుతో ఇద్దరు విద్యార్థులు వైద్యం పొందుతూ మృతి చెందారు . దాని అనంతరం స్కూల్ కు ప్రహరీ ఏర్పాటు చేశారు అయినప్పటికీ సిబ్బందిలో ఎటువంటి మార్పు లేదు విద్యార్థులు ప్రహరీ మీద నుంచి జంప్ చేస్తూ బయటికి వెళ్లి వస్తున్నారు, ఏదైనా జరగరానిది జరిగితే దానికి బాధ్యులు ఎవరు అవుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు చుట్టు తుప్పలు, మొక్కలు పూర్తిగా ఉండడం చుట్టూ పాములు తిరుగుతున్నడం ఇక్కడ సాధారణ అయినప్పటికీ నిర్లక్ష్యంగా విద్యార్థులను పట్టించుకోకుండా ఉండటం గమనార్హం.. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని కోరుకుందాం
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  ఆరోగ్యం  మన్యం / Manyam 

గిరిజన ప్రాంతాల్లో అర్హత మరియు,అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేట్ క్లినిక్ పై చర్యలు తీసుకోవాలి* 

గిరిజన ప్రాంతాల్లో అర్హత మరియు,అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేట్ క్లినిక్ పై చర్యలు తీసుకోవాలి*  పార్వతీపురం మన్యం గతంలో పార్వతీపురం ఐటీడీఏ *ప్రాజెక్టు అధికారి గా  పని చేసిన  సువర్ణ పండా దాస్ ఐఏఎస్* గారు  పని చేసిన కాలంలో అర్హత, అనుమతులు లేని ప్రైవేటు క్లినిక్ పై నిషేధం విధించారు. ఆయన బదిలీ అయ్యాక మరల తెరుచుకోవడం జరిగింది. వీటిపై అనేక ఆరోపణలు ఉన్నప్పట్టికీ జిల్లా వైద్య అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవరించడం దారుణమని మరల వీటి పైనా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పిర్యాదు చేస్తామని ఆదివాసీ గిరిజనాభ్యుదయ సంఘ అధ్యక్షులు ఆరిక చంద్రశేఖర్ తెలిపారు.
Read More...
జాతీయం / National  ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  ఆరోగ్యం  మన్యం / Manyam 

డమ్మీ డాక్టర్ వైద్యం - నిండు ప్రాణం బలి...

డమ్మీ డాక్టర్ వైద్యం - నిండు ప్రాణం బలి...   మెడికల్ షాప్ పేరుతో వైద్యం బ్లడ్ టెస్ట్ లు - పట్టించుకోని అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీలో అర్హత లేకుండా వైద్యం చేయడం, రక్త పరీక్షలు చేయడం దోచుకోవడం,పేషంట్ ప్రాణాలు పోతే తప్పించుకోవడానికి దారులు వెతుక్కోవడం సాధారణం అయిపోయింది, కురుపాం మండలం గుమ్మ గ్రామానికి చెందిన లాభాల సాయి కృష్ణ (32) కు ఒక్క పూట జ్వరం వస్తే తెలిసిన వాడే కదా అని నమ్మి ఎల్విన్ పేట లో ఉన్న రవి మెడికల్ షాపును సంప్రదించారు ఆయనే ఒక పెద్ద డాక్టర్ గా భావించుకొని రక్త పరీక్షలు చేసి కోర్సులు పెట్టేసి సుమారు మూడు రోజులు మందుల తరవాత ఈ నెల 14 ఆదివారం సాయికృష్ణ కు విరోచనాలు అవ్వడం తో మళ్ళీ డమ్మీ వైద్యుడు తన ప్రతాపం చూపి 15 నిమిషాల్లో పూర్తి అయ్యేలా సిలియన్ బాటిల్ పెట్టి సిలైన్ లో ఏవో ఏవో ఇంజక్షన్ లు ఇచ్చేసరికి మనిషి చలవలు కమ్మి రంగు మారిపోయేసరికి తనకారే ఇచ్చి సోమవారం శ్రీకాకుళం హాస్పిటల్ కు తరలించారు తీరా చూస్తే మార్గ మధ్యలోనే సాయి కృష్ణ మృతి చెందారు.. ఆయన మృతి తట్టుకోలేని భార్య ఏడ్చి ఏడ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆసుపత్రిపాలయ్యారు దీంతో ఒకవైపు ఆమెను చూసుకొని ఈ మరణం పై ఆయన చేసిన తప్పుడు వైద్యంపై ఫైట్ చేయలేని పరిస్థితి కుటుంబ సభ్యులకి ఏర్పడింది, పెళ్లి అయి రెండేళ్లు కూడా అవ్వని పరిస్థితుల్లో యువకుడు మృతి చెందటం అది కూడా వైద్యం వికటించి కోరి చంపుకున్నట్టు భావిస్తున్నారు, ఇదిలా ఉండగా గిరిజన ప్రాంతాల్లో ఇలాంటివి సాధారణమైపోయింది, ఎవరికి వారే ఇష్టానుసారంగా వాహనాలతో గ్రామాల్లో వైద్యులుగా తిరుగుతూ చలమనవుతూ అనేకమంది మరణాలకు కారకులు అవుతున్నారు కానీ వైద్య అధికారులు కానీ పర్యవేక్షణ లేకపోవడం ఒకవేళ ఉన్న కాసులకు కక్కుర్తి పడడంతో ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి... గట్టిగా నిలబడి తప్పు చేసిన వైద్యుల్ని నిలదీయడానికి కుటుంబ సభ్యులు సంకోచించడానికి కారణం వైద్యుడు ఆ కుటుంబానికి దూరపు బంధువు లేక మధ్యలో ఉన్న కొంతమంది బ్రోకర్లు బెదిరింపులో కారణమని పలువురు భావిస్తున్నారు.. ఇప్పటికైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
Read More...
పాలిటిక్స్  ట్రెండింగ్  మన్యం / Manyam 

జూలై 18 నుండి 28వ తేదీ వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు

జూలై 18 నుండి 28వ తేదీ వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు  పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ జనసేన  పార్టీ  ఐటీ కోఆర్డినేటర్ ఎల్ రంజిత్ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కేంద్ర ఆదేశాల మేరకు 4వ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈనెల 18 నుండి 28వ తేదీ వరకు ఒక పండగ లా జరుగుతుందని అన్నారు. క్రియాశీలక సభ్యత్వం కావాలనుకునే వారు, క్రియాశీల సభ్యత్వం రెన్యువల్ కొరకు రూ.500 చెల్లించాలని అన్నారు. జనసేన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నామన్నారు. నేడు మనం కట్టే 500 రూపాయలు రేపు మన కుటుంబానికి 5 లక్షల రూపాయల భద్రతను & , భరోసాను కల్పిస్తుందని ఇది దేశంలో ఏ పార్టీ చేయని విధంగా ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా తమ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు భరోసానిస్తూ ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. క్రియాశీలక సభ్యుడు పార్టీ ఏ సమావేశానికి గాని, రోడ్డుపై నిరసన కార్యక్రమానికి గాని పిలుపునిచ్చినాతప్పనిసరిగా హాజరుకావాలని, అటువంటి సభ్యులకు ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే వారికి భరోసాను కల్పిస్తూ ఆసరాగా ఉండేందుకు ఏదైనా పార్టీ ఉందంటే అది జనసేన పార్టీయేనని అన్నారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పపార్టీ తరపున పోటీ చేసేందుకు అర్హతగా తప్పనిసరి క్రియాశీలక సభ్యులుగా ఉండాలని, ఆ క్రియాశీలక సభ్యుడు ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధి విధానాలని చెప్పగలుగుతాడాని అన్నారు. ఇప్పటి వరకు 5 లక్షల సభ్యత్వాలు ఉండగా దాన్ని 10 నుండి 15 లక్షల సభ్యత్వాలు అయ్యేందుకు కృషి చేస్తామని తెలిపారు.
Read More...
ట్రెండింగ్  మన్యం / Manyam 

జిల్లా పరిషత్ హై స్కూల్ ను పరిశీలించిన నోడల్ అధికారి.. 

జిల్లా పరిషత్ హై స్కూల్ ను పరిశీలించిన నోడల్ అధికారి..  పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ ను కురుపాం మండల నోడల్ అధికారి అయినా మన్యం జిల్లా పంచాయతీ అధికారి పీ .సత్యనారాయణ సందర్శించారు.. పారిశుద్ధ్య పరిశుభ్రత పక్షోత్సవాలు కార్యక్రమం లో భాగంగా పిల్లలు హ్యాండ్ వాష్ ఎలా చేస్తున్నారు అని తెలుసుకొని పరిశుభ్రత కోసం పలు సూచన చేసి ఎండిఎం మెనూని పరిశీలించి అనంతరం పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు పైన మరియు ఇతర విషయాలపై పలు సూచనలు చేశారు, ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి తో పాటు,ఏం ఈ ఓ,ఎంపిడిఓ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, మరియు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు టి శంకర్ రావు పాల్గొన్నారు
Read More...
ట్రెండింగ్  మన్యం / Manyam 

ఏజెన్సీలో ఏనుగుల గుంపు హల్చల్

ఏజెన్సీలో ఏనుగుల గుంపు హల్చల్ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీ ప్రాంతం అయిన జరడ గ్రామ పంచాయతీ లో నాలుగు అడవి ఏనుగులు గుంపు సంచరిస్తుండడం తో ఆయా ప్రాంత గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.. గిరిజనులు సాగుచేస్తున్నటువంటి కొర్రలు,రాగులు,జొన్నలు వంటి చిరుదాన్యాల పంటలను తొక్కి నాశనం చేస్తుండడం తో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు..తక్షణమే ఏనుగులను తరలించి నష్టపోయిన తమ పంటలకు నష్టపరిహారం అందించాలని ఆయా ప్రాంత గిరిజనులు కోరుతున్నారు...
Read More...
ట్రెండింగ్  మన్యం / Manyam 

భారీ వృక్షం నెల మట్టం

భారీ వృక్షం నెల మట్టం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం పీ.లేవిడి గ్రామ సమీపంలో రోడ్డుపై  భారీ వృక్షం కూలిపోయింది  సుమారు కిలోమీటర్ దూరంలో వాహనాలు నిలిచిపోయాయి..అధికారులు చెట్టు ను తొలగించడానికి ఏర్పాటు చేస్తున్నారు..
Read More...
ట్రెండింగ్  మన్యం / Manyam 

భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టం....తృటిలో తప్పిన పెను ప్రమాదం...

భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టం....తృటిలో తప్పిన పెను ప్రమాదం... పార్వతీపురం మన్యం జిల్లా... గత రెండు రోజులుగా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లు నేలమట్టం అయ్యింది...   గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో ఉన్న తంగుడు పకీర నాయుడు, చింతల విమల రాణి ఇల్లు కులాయి. పెద్దగా శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. చిన్నారులతో నిద్రిస్తున్న సమయంలో వారిపై కూలింది.. నిమిషం పాటులో పెను ప్రమాదం తప్పింది...సంఘటన స్థలాన్ని పలువులు నాయకులు సందర్శించి బాధితులు తో  మాట్లాడేరు 
Read More...
పాలిటిక్స్  మన్యం / Manyam 

ఘనంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి జన్మదిన వేడుకలు...

ఘనంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి జన్మదిన వేడుకలు... పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మాలక్ష్మీపురం లో  ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి జన్మదిన వేడుకలు జరిపారు, ఈ వేడుకలు హాజరు అయి టిడిపి రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్ర దేవ్, కార్యనిర్వహక కార్యదర్శి దత్తి లక్ష్మణ రావు, పార్లమెంటు అధికార ప్రతినిధి, డొంకాడ రామకృష్ణ,మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోలా రంజిత్ కుమార్,పొట్నూరు వెంకట నాయుడు , ఐదు మండలాల తెదేపా,జనసేన, బిజేపి,నాయకులు కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు..
Read More...