Category
కాకినాడ / Kakinada
కాకినాడ / Kakinada 

జూలై నెలాఖరుకి తాళ్ళూరు లిఫ్ట్ నుంచి నీరు పారుతుంది

జూలై నెలాఖరుకి తాళ్ళూరు లిఫ్ట్ నుంచి నీరు పారుతుంది జగ్గంపేట, పెన్ పవర్, ఏప్రిల్ 4: గండేపల్లి మండలం తాళ్ళూరు లిఫ్ట్ నుంచి జూలై నెలాఖరుకి ఖచ్చితంగా నీరు పారుతుందని పంటలు వేసుకునేందుకు రైతులంతా సిద్ధంగా ఉండాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం గండేపల్లి మండలం మురారిలో ఎమ్మెల్యే నెహ్రూ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గత సీజన్ లో నీరు పంటలకు అందే పరిస్థితి లేక పంటలు వేసుకోవద్దని తేల్చి చెప్పాననన్నారు. అయితే దీనిపై సీఎం చంద్రబాబుతో 15సార్లుకు పైగా మాట్లాడి ఇరిగేషన్ మంత్రితో చర్చలు జరిపానన్నారు. ఇటీవల ఏవరో సోషల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే నెహ్రూ వల్లే తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందని వైసీపీ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉండేదని విమర్శలు చేస్తున్నారని అసలు తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ కి సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటో తెలుసా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించలేదని మాట్లాడుతున్నారని అసలు బడ్జెట్ ఎలా ప్రవేశ పెడతారో కూడా తెలియని వాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. తాళ్ళూరు లిఫ్ట్ పై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నామని ఏదేమైనప్పటికీ జూలై నెలాఖరుకి నీరు పారుతుందని ఎమ్మెల్యే నెహ్రూ స్పష్టం చేశారు.
Read More...
కాకినాడ / Kakinada 

ఎన్నో అవమానాలు తట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ 

ఎన్నో అవమానాలు తట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్   జగ్గంపేట, పెన్ పవర్, మార్చి 8: ఎన్నో అవమానాలు తట్టుకుని, ఆయనకున్న సినిమా అవకాశాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారు పరిణయ ఫంక్షన్ హాల్ లో శనివారం రాత్రి జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కౌడా చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 11 సంవత్సరాలు పార్టీని తన భుజాన మోసారన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే ఈ ఆవిర్భావ సభను ప్రతీ ఒక కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు. పెద్ద ఎత్తున సభకు హాజరై గర్వపడేలా సభ నిర్వహిద్దామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు భారీగా హాజరయ్యారు. 
Read More...
కాకినాడ / Kakinada 

జగ్గంపేటలో 492 కేజీల గంజాయి పట్టివేత.. ఎనిమిది మంది అరెస్ట్

జగ్గంపేటలో 492 కేజీల గంజాయి పట్టివేత.. ఎనిమిది మంది అరెస్ట్ కాకినాడ జిల్లా జగ్గంపేటలో గంజాయి రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దీనిపై బుధవారం జగ్గంపేట పోలీస్ స్టేషన్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం నుండి జగ్గంపేట ఓ ఇంట్లో ఉంచి తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. 8 మందిని అరెస్టు చేసి రూ.30.50లక్షల విలువ గల 492 కేజీల గంజాయి, ఒక కారు,ఏడు సెల్ ఫోన్లు రూ.రెండు లక్షల 78 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్, జగ్గంపేట ఎస్ఐ టి. రఘునాథరావు, గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, కిర్లంపూడి ఎస్ఐ సతీష్ పాల్గొన్నారు. 
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ట్రెండింగ్  కాకినాడ / Kakinada  స్థానిక రాజకీయాలు 

ఒక్క రోజే జనసేన ప్లీనరీ

ఒక్క రోజే జనసేన ప్లీనరీ కాకినాడ , పెన్ పవర్  ఫిబ్రవరి 22: జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ప్లీనరీ అంటే ఆ పార్టీ కార్యకర్తలకు అభిమాన శ్రేణులకి పండగనే చెప్పాలి. సాధారణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లీనరీలు ఏర్పాటు చేస్తుంటారు పార్టీల అధినేతలు. పార్టీ శ్రేణులకు భవిష్యత్తు దిశా నిర్దేశం చేయడానికి ప్లీనరీలను ఏర్పాటు చేస్తాయి...
Read More...
క్రైమ్  కాకినాడ / Kakinada 

జగ్గంపేట : ముగ్గురు పేకాటరాయుళ్లు అరెస్ట్

జగ్గంపేట : ముగ్గురు పేకాటరాయుళ్లు అరెస్ట్ జగ్గంపేట, పెన్ పవర్, ఫిబ్రవరి 21: జగ్గంపేట శివారు టవర్ కాలనీలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావడంతో శుక్రవారం జగ్గంపేట ఎస్ఐ టి.రఘునాధరావు తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.6100 నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎక్కడైనా జూదాలకు పాల్పడిన, అశ్లీల నృత్య ప్రదర్శనలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రఘునాధరావు హెచ్చరించారు.
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  కాకినాడ / Kakinada 

విలేకరులపై దాడులు ఖండించాలని జగ్గంపేటలో నిరసన ధర్నా

విలేకరులపై దాడులు ఖండించాలని జగ్గంపేటలో నిరసన ధర్నా విలేకరులపై జరుగుతున్న దాడులు ఖండించాలని బుధవారం జగ్గంపేటలో పాత్రికేయులు నిరసన ధర్నా నిర్వహించారు. జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు హాజరయ్యారు. పార్వతీపురం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగ్గంపేట సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్, తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం జగ్గంపేట సీఐ వై ఆర్ కే శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావుకు వినతి పత్రం అందించారు.
Read More...
క్రైమ్  కాకినాడ / Kakinada 

బుడగ తెచ్చిన గొడవ.. నలుగురు అరెస్ట్

బుడగ తెచ్చిన గొడవ.. నలుగురు అరెస్ట్ చిన్నపిల్లోడు సరదాగా ఆడుకుంటున్న బుడగ వల్ల గొడవై నలుగురు అరెస్ట్ అయి జైలుకి వెళ్లిన సంఘటన మంగళవారం జగ్గంపేట మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి జగ్గంపేట సీఐ వైఆర్ కే శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన డి.ఏసు ఇంటి వద్ద గత నెలలో రాత్రి 8 గంటల సమయంలో ఏసు మనవడు బుడగలతో ఆడుకుంటుండగా ఆ బుడగ వెళ్లి అదే వీధిలో గల బి.మార్తమ్మకు తగలడంతో ఆమె ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వెంటనే వారి కుటుంబ సభ్యులైన బి.కృష్ణ బి.రాజేష్ పి.ఆనంద్ కుమార్ మరో ఇద్దరు మహిళలు కలిసి గునపాలు, కర్రలు, రాళ్లతో ఏసు ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఏసు కుడి చెయ్యి విరిగి గాయం కావడం, కుటుంబీకులు గాయాలు పాలయ్యారు. దీనిపై ఏసు జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి ముద్దాయిలైన బి.రాజేష్, పి.ఆనంద్ కుమార్ మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా వారికి 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. ఎవరైనా ఘర్షణలకు దిగితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. 
Read More...
కాకినాడ / Kakinada 

గేమ్ చేంజర్ ఈవెంట్ కు జగ్గంపేట నుంచి భారీగా తరలివెళ్లిన మెగా అభిమానులు

గేమ్ చేంజర్ ఈవెంట్ కు  జగ్గంపేట నుంచి భారీగా తరలివెళ్లిన మెగా అభిమానులు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజేష్ కల్లేపల్లి యుఎస్ఏ ఆధ్వర్యంలో భారీ కార్లు, బైక్ ర్యాలీలతో శనివారం మధ్యాహ్నం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జగ్గంపేట శివారు నగరం లో మెగా అభిమానులకు భోజనాలు ఏర్పాటు చేసి ఈవెంట్ కు పాసులు అందజేశారు. కల్లేపల్లి రాజేష్ టీం జన్నెల శంకర్, పసుపులేటి పవన్, పార్సి వేణు, తోలాటి వీరబాబు, పైలా ప్రసాద్ తదితరులు భారీగా అభిమానులతో కలిసి వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మెగా అభిమానులు హాజరయ్యారు.
Read More...
కాకినాడ / Kakinada 

జగ్గంపేటలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

జగ్గంపేటలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కాలేజీలో డయాస్ ఏర్పాటు చేస్తామని, రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Read More...
క్రైమ్  కాకినాడ / Kakinada 

పోలీస్ కానిస్టేబుళ్లను ఢీకొన్న కారు గంజాయి తరలిస్తున్నదేనని స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ 

పోలీస్ కానిస్టేబుళ్లను ఢీకొన్న కారు గంజాయి తరలిస్తున్నదేనని స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్  డిసెంబర్ 31 వ తేదీ అర్ధరాత్రి కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారు ఢీకొట్టి ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం జగ్గంపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరై వివరాలు వెల్లడించారు. కృష్ణవరం టోల్గేట్ వద్ద వాహన తనిఖీల్లో కారును నిలువరిస్తుండగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన కారు ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీ కొట్టి వెళ్లిపోయిందని వెంటనే ఐదు బృందాలుగా దర్యాప్తు చేపట్టి 24 గంటలు తిరగకుండా నిందితుల్ని పట్టుకున్నట్లు తెలిపారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగడ్ కు గంజాయి తరలిస్తుండగా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామం పోలవరం కెనాల్ వద్ద కారు స్వాధీనం చేసుకుని ముద్దాయిలు తరుణ్ కుమార్, జాహిద్, ముస్తాకిమ్, మొహమ్మద్ జాకీర్ ను అరెస్టు చేశామన్నారు. ఈ కారులో మూడు బ్యాగుల్లోని 31 ప్యాకెట్లలో రూ. 3.43 లక్షలు విలువ చేసే 68.6 కేజీల గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని కోర్టు లో హాజరు పరుస్తామన్నారు. గాయాల పాలైన కానిస్టేబుల్ లోవరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతన్ని పరామర్శించానన్నారు. విధి నిర్వహణలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన జగ్గంపేట సిఐ వై ఆర్ కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ సతీష్, వారి సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Read More...
పాలిటిక్స్  కాకినాడ / Kakinada 

జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన జగ్గంపేట వైసీపీ నాయకులు

జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన జగ్గంపేట వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం ఆదేశాల మేరకు గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జగ్గంపేటలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు కాపవరపు ప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గణేష్ రాజా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశ ప్రధమ సామాజికతత్వవేత్త , సమన్యాయ సత్య బోధకుడు అని, అంటరానితనాన్ని, కుల వ్యవస్థను నిర్మూలించడంలో, మహిళలు యొక్క అభ్యున్నతికి పాటుపడడంతో పాటుగా, విద్యారంగంలో, వితంతు మహిళల పట్ల ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రం మహాలక్ష్మి, గాది కృష్ణ, అడబాల నాగు, గిడియాల పెద్దకాపు, సాపిరెడ్డి సత్తిబాబు, పల్లపాటి రాజు, పైలా చైతన్య, పైలా నానాజీ, వడ్లపాటి జయబాబు, కాపవరపు సుబ్రహ్మణ్యం, అంబటి చిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Read More...
ఆధ్యాత్మికం  కాకినాడ / Kakinada 

రేపు నాయకంపల్లిలో శివ పంచాయతన క్షేత్రం ప్రారంభం

రేపు నాయకంపల్లిలో శివ పంచాయతన క్షేత్రం ప్రారంభం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శివ పంచాయతన క్షేత్రాన్ని రేపు(గురువారం) జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి ప్రారంభిస్తారని తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస బంగారయ్య శర్మ తెలిపారు. బుధవారం నాయకంపల్లి గ్రామంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్షేత్రంలో నిర్మించిన  సువర్ణ భారతి గోశాల, పాకశాల, ప్రవచన మంటపములు ప్రారంభించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ అగ్నిహోత్రిని దేవాలయం నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరు కావాలని కోరారు. 
Read More...