Category
జాతీయం / National
జాతీయం / National  క్రైమ్  ట్రెండింగ్  ఎడిటోరియల్ 

డ్రాగన్ ను అడగడుగునా అడ్డుకుంటూ....

డ్రాగన్ ను అడగడుగునా అడ్డుకుంటూ.... భారత్‌కు దాయాది దేశం పాకిస్తాన్‌ తలనొప్పిగా మారింది. ఉగ్రవాదులను, చొరబాట్లను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ భారత్‌లో అలజడికి ప్రయత్నిస్తోంది. ఐదేళ్లుగా మరో పొరుగు దేశం చైనా కూడా తన చర్యలతో భారత్‌ను కవ్విస్తోంది. తరచూ సరిహద్దులు మారుస్తూ.. మ్యాప్‌లు విడుదల చేస్తోంది. గాల్వన్‌లో అయితే చొరబాటుకు ప్రయత్నించింది. భారత సైన్యం దానిని తిప్ప కొంట్టింది. అప్పటి నుంచి చైనా భారత్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి నుంచి భారత్‌ను కవ్విస్తోంది. దీంతో మోదీ కూడా చైనాకు చెక్‌ పెట్టే చర్యలు మొదలు పెట్టారు.
Read More...
జాతీయం / National  పాలిటిక్స్  ట్రెండింగ్  ఎడిటోరియల్ 

మోడీకి షాకిచ్చిన కశ్మీరం...  

మోడీకి షాకిచ్చిన కశ్మీరం...   వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్న సామెత ఇప్పుడు బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో, ఇవాళ జమ్మూకశ్మీర్‌ ఎలక్షన్స్‌ ఫలితాలు చూస్తే ఇదే స్పష్టం అవుతుంది. 500 ఏళ్ల హిందువుల కల అయోధ్య రామ మందిర నిర్మాణంచేపట్టినా, ఆర్టికల్‌ 370 రద్దు చేసినా బీజేపీకి చేదు ఫలితం ఎదురైంది..
Read More...
జాతీయం / National  ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  మన్యం / Manyam  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  భద్రాద్రి / Bhadradri 

చివరి దశకు నక్సల్స్‌ పోరాట బరి

చివరి దశకు  నక్సల్స్‌ పోరాట బరి ఆధునిక సమాజంలో సమస్యల రూపం సమూలంగా మారిపోయింది. కానీ, అడవుల్లో ఉన్న ఉద్యమ నాయకులు మాత్రం గత భూస్వామ్య, పెట్టుబడీదారి భావజాలంలోనే కొనసాగుతున్నారు. గ్లోబలైజేషన్‌ అడవులకు చేరుకుంటున్న తరుణంలో.. అడవుల్లో గిరిజనులే లేకుండా పోతున్నారు. నక్సలైట్లుగా మారే వాళ్లు తక్కువవుతుంటే.. ఉన్నవారికి లొంగుబాట్లు, కుంగుబాట్లే మిగిలాయి. మహిళల్నీ, బాలికల్ని రిక్రూట్‌ చేసుకుంటున్న పరిస్థితులు పెరిగాయి. దాదాపు రెండు దశాబ్ధాల నుండి నడుస్తున్న ఈ సంక్షోభం ఇప్పుడు పీక్స్‌కు చేరుకుంది.
Read More...
జాతీయం / National  పాలిటిక్స్  ట్రెండింగ్ 

జమిలీ ఎన్నికలకు మరో రెండు అడుగులు

జమిలీ ఎన్నికలకు మరో రెండు అడుగులు జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.  జమిలీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగ సవరణలు తప్పనిసరి అయిన దశలో.. పార్లమెంటు ఉభయసభలతో పాటు రాష్ట్ర అసెంబ్లీలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో మూడిరచ రెండు వంతుల ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో భాజపా బలం చూస్తే.. ఎన్డీయే పక్షాలతో పాటు ఇతర పక్షాల ఎంపీలు కూడా కొందరు సహకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్‌డీఏ బలం 293 కాగా.. రాజ్యాంగ సవరణ కోసం 362 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇదే విధంగా రాజ్యసభలో ఎన్‌డీఏ బలం 121 కాగా.. రాజ్యాంగ సవరణలు చేపట్టాలంటే 164 మంది సభ్యుల మద్దతు ఉండాలి. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల మాటలకూ గౌరవం ఉంటుంది కాబట్టి.. రాజ్యాంగ సవరణకు సగం రాష్ట్రాల అసెంబ్లీలు అనుమతించాలి. అంటే దాదాపు 14కి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలి.
Read More...
జాతీయం / National  ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  తెలంగాణ/Telangana  పాలిటిక్స్  ట్రెండింగ్ 

 పాజిటివ్‌ టాక్‌ లో ఎన్డీయే సర్కార్‌

 పాజిటివ్‌ టాక్‌ లో ఎన్డీయే సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌ అయింది. ఎన్డీఏ ఏపీలో అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది. అయితే ఈ సందర్భంగా ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఇది అతి తక్కువ సమయం. కేవలం వంద రోజుల సమయంలో మ్యాజిక్‌ లు చేయడానికి చంద్రబాబు ఏవిూ మెజీషియన్‌ కాదు. హావిూలు అమలు చేయలేదంటే అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు.
Read More...
జాతీయం / National  ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  తెలంగాణ/Telangana  ఫ్యూచర్స్  ట్రెండింగ్  హైదరాబాద్ / Hyderabad  ఎడిటోరియల్ 

ఆక్రమణలతోనే  ఈ దుస్థితి...

ఆక్రమణలతోనే  ఈ దుస్థితి... ఢల్లీి, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ ఇలా అన్ని మెట్రో సిటీస్‌ వరద బాధిత నగరాలే. ఎందుకంటే నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది. ప్రైమ్‌ లొకేషన్‌ లో గజం దొరికినా చాలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీంతో కొందరు నాలాలు, చెరువుల భూముల్ని కబ్జా చేయడం మొదలు పెట్టారు. అందుకే హైదరాబాద్‌...
Read More...
జాతీయం / National  ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  తెలంగాణ/Telangana  పాలిటిక్స్  క్రైమ్  ట్రెండింగ్ 

చార్జింగ్‌ సమయంలో ట్యాంపరింగ్‌....

చార్జింగ్‌ సమయంలో ట్యాంపరింగ్‌.... దేశంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 400 పార్లమెంట్‌ స్థానాల్లో విజయమే లక్ష్యంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ బరిలో దిగింది. బిజెపి ఒంటరిగా 300 స్థానాలు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ బిజెపి ప్రయత్నాలు తలకిందులయ్యాయి. ఆ పార్టీ కేవలం 244 స్థానాలకి పరిమితం అయ్యింది. దీంతో మిత్రపక్షాలైన తెలుగుదేశం, జెడియు మద్దతుతో మోడీ మూడోసారి...
Read More...
జాతీయం / National  క్రైమ్ 

పట్టాలు తప్పిన ముంబై హౌరా మెయిల్

పట్టాలు తప్పిన ముంబై హౌరా మెయిల్ జంషెడ్‌పూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని బడాబాంబూ వద్ద ఘటన ముంబై-హౌరా మెయిల్‌లోని 10 కోచ్‌లు పట్టాలు తప్పడంతో ఆరుగురికి గాయాలు, భారతీయ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను జారీ  పెన్ పవర్, ఇంటర్నెట్ డెస్క్ జార్ఖండ్ జులై 30: 
Read More...
జాతీయం / National  ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  ఆరోగ్యం  మన్యం / Manyam 

డమ్మీ డాక్టర్ వైద్యం - నిండు ప్రాణం బలి...

డమ్మీ డాక్టర్ వైద్యం - నిండు ప్రాణం బలి...   మెడికల్ షాప్ పేరుతో వైద్యం బ్లడ్ టెస్ట్ లు - పట్టించుకోని అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీలో అర్హత లేకుండా వైద్యం చేయడం, రక్త పరీక్షలు చేయడం దోచుకోవడం,పేషంట్ ప్రాణాలు పోతే తప్పించుకోవడానికి దారులు వెతుక్కోవడం సాధారణం అయిపోయింది, కురుపాం మండలం గుమ్మ గ్రామానికి చెందిన లాభాల సాయి కృష్ణ (32) కు ఒక్క పూట జ్వరం వస్తే తెలిసిన వాడే కదా అని నమ్మి ఎల్విన్ పేట లో ఉన్న రవి మెడికల్ షాపును సంప్రదించారు ఆయనే ఒక పెద్ద డాక్టర్ గా భావించుకొని రక్త పరీక్షలు చేసి కోర్సులు పెట్టేసి సుమారు మూడు రోజులు మందుల తరవాత ఈ నెల 14 ఆదివారం సాయికృష్ణ కు విరోచనాలు అవ్వడం తో మళ్ళీ డమ్మీ వైద్యుడు తన ప్రతాపం చూపి 15 నిమిషాల్లో పూర్తి అయ్యేలా సిలియన్ బాటిల్ పెట్టి సిలైన్ లో ఏవో ఏవో ఇంజక్షన్ లు ఇచ్చేసరికి మనిషి చలవలు కమ్మి రంగు మారిపోయేసరికి తనకారే ఇచ్చి సోమవారం శ్రీకాకుళం హాస్పిటల్ కు తరలించారు తీరా చూస్తే మార్గ మధ్యలోనే సాయి కృష్ణ మృతి చెందారు.. ఆయన మృతి తట్టుకోలేని భార్య ఏడ్చి ఏడ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆసుపత్రిపాలయ్యారు దీంతో ఒకవైపు ఆమెను చూసుకొని ఈ మరణం పై ఆయన చేసిన తప్పుడు వైద్యంపై ఫైట్ చేయలేని పరిస్థితి కుటుంబ సభ్యులకి ఏర్పడింది, పెళ్లి అయి రెండేళ్లు కూడా అవ్వని పరిస్థితుల్లో యువకుడు మృతి చెందటం అది కూడా వైద్యం వికటించి కోరి చంపుకున్నట్టు భావిస్తున్నారు, ఇదిలా ఉండగా గిరిజన ప్రాంతాల్లో ఇలాంటివి సాధారణమైపోయింది, ఎవరికి వారే ఇష్టానుసారంగా వాహనాలతో గ్రామాల్లో వైద్యులుగా తిరుగుతూ చలమనవుతూ అనేకమంది మరణాలకు కారకులు అవుతున్నారు కానీ వైద్య అధికారులు కానీ పర్యవేక్షణ లేకపోవడం ఒకవేళ ఉన్న కాసులకు కక్కుర్తి పడడంతో ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి... గట్టిగా నిలబడి తప్పు చేసిన వైద్యుల్ని నిలదీయడానికి కుటుంబ సభ్యులు సంకోచించడానికి కారణం వైద్యుడు ఆ కుటుంబానికి దూరపు బంధువు లేక మధ్యలో ఉన్న కొంతమంది బ్రోకర్లు బెదిరింపులో కారణమని పలువురు భావిస్తున్నారు.. ఇప్పటికైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
Read More...
జాతీయం / National  ట్రెండింగ్ 

నీట్ పీజీ పరీక్ష

 నీట్ పీజీ పరీక్ష తేదీ ప్రకటించారు, పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది 11 ఆగస్టు 2024న పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. 
Read More...
జాతీయం / National  ట్రెండింగ్ 

అమితాబ్ బచ్చన్ 'కెబిసి' కొత్త సీజన్ కోసం తిరిగి రానున్నారు.

అమితాబ్ బచ్చన్ 'కెబిసి' కొత్త సీజన్ కోసం తిరిగి రానున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతి' నిర్మాతలు మంగళవారం, ఏప్రిల్ 26 నుండి రిజిస్ట్రేషన్‌లతో పాటు కొత్త సీజన్‌ను ప్రకటించారు. క్విజ్ ఆధారిత రియాల్టీ షోను మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్నారు. సీజన్ 15 యొక్క చివరి ఎపిసోడ్ డిసెంబర్ 29, 2023న ప్రసారం చేయబడింది. ఇప్పుడు, మేకర్స్ సోషల్ మీడియాలోకి వెళ్లి ఒక అనౌన్స్‌మెంట్ వీడియోను...
Read More...
జాతీయం / National  ట్రెండింగ్  మన్యం / Manyam  స్పెషల్ ఆర్టికల్స్ 

ఐఏఎస్ ర్యాంక్ సాధించిన కురూపాం కు చెందిన వ్యక్తి

ఐఏఎస్ ర్యాంక్ సాధించిన కురూపాం కు చెందిన వ్యక్తి ఈరోజు విడుదలైన 2024 సివిల్స్ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గ్రామానికి చెందిన కురుపాం మాజీ ఎం.ఈ. ఓ. దొనక విజయ్ కుమార్ మాస్టర్ కుమారుడు దొనక పృద్వి రాజ్ ఐ.ఏ.ఎస్.(443 ర్యాంక్ ) కు ఎంపికైయ్యారు..వారు ప్రస్తుతం పార్వతీపురం లో నివాసం ఉంటున్నారు..గ్రామస్తులు తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఐఏఎస్ లో ర్యాంక్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు
Read More...