Category
ప్రకాశం / Prakasam
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ప్రకాశం / Prakasam  సాధారణ వార్తలు 

*ఉపాధిలో బాల కార్మికులు*

*ఉపాధిలో బాల కార్మికులు* పెద్దలతో పాటే చిన్నారులు పనుల్లోనే.. కనీస వసతులు, రక్షణ చర్యలు కరువు తూతూ మంత్రంగా తనిఖీలు పుల్లలచెరువు పెన్ పవర్ ఫిబ్రవరి 24 :ఉపాధి హామీలో బాల్యం ఊగిసలాడుతుంది. ఆ చిట్టిచేతులు చక్కని రాతకు, చదువుకు దూరమవుతున్నాయి. చేతిలో బలపం పట్టి చదుకోవాల్సిన చిన్నారులు మట్టి తట్టలు మోస్తూ ఉపాధి హామీ పథకంలో మగ్గిపోతున్నారు.పుల్లల చెరువు మండలం ముటుకుల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చిన్నారులను శ్రమ జీవులుగా మార్చి వేస్తున్నారు.ఇటీవల పుల్లలచెరువు మండలం ముటుకుల పంచాయతీలో కామిరెడ్డి చెరువులో ఉపాధి హామీ పని చేపట్టారు.ఈ పనిలో ఫిబ్రవరి 10వ తేదీ మస్టర్ రోల్ నెంబర్ 25371 న స్వయాన ఫీల్డ్ అసిస్టెంట్ తీసిన ఫోటోలో ఒక బాలికను పనిలోకి తీసుకువెల్లిన ఘటన ఆల్యంగా వెలుగు చూసింది.పెరుసోముల రూపా తండ్రి కృష్ణ అనే 12 సంవత్సరాల బాలికను ఉపాధి హామీ పనిలోకి తీసుకువెళ్లి ఉపాధి హామీ పని చేయించినట్లుగా ఫోటోలు తీసి సర్వర్లో అప్లోడ్ చేశాడు.14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలోకి పెడితే ఆరు నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది అని సమాచారం. ఈ విషయాలన్నీ తెలిసే తను నన్ను ఎవరూ ఏమి చేయలేరు అనే ధీమాతోనే బాల కార్మికులతో పనులు చేపిస్తున్నాడని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. గతంలో హౌసింగ్ సాంక్షన్ అయిన లబ్ధిదారుల డబ్బులను తన పేరు మీద తన భార్య మీద పేరు మీద పేమెంట్ చేపించుకొన్న విషయం బయటకు వచ్చిన అతనిపై చర్యలు మాత్రం ఇంతవరకు అధికారులు తీసుకోలేదు.ఉపాధి సిబ్బంది నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.అయినా బాల కార్మికశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.బడీడు పిల్లలు బడుల్లో చదువుకోవాలనే ఉద్దేశ్యంతో 6-14 సంవత్సరాల వరకు ప్రభుత్వం నిర్బంధ విద్యను అమలు చేస్తుంటే వాటిని అమలు పరుచడంలో అధికారులు మాత్రం విఫలమవుతున్నారు. కార్మిక, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్న పిల్లలను గుర్తించేందుకు పలు సందర్భాల్లో తనిఖీలు చేపడుతున్నా అవి తూతూ మంత్రంగానే ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చిన్నారుల కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  ప్రకాశం / Prakasam  బాపట్ల / Bapatla  సాధారణ వార్తలు 

సూర్యలంక బీచ్ కు జనాలు పోటెత్తున్నారో...

సూర్యలంక బీచ్ కు   జనాలు పోటెత్తున్నారో... ఒంగోలు, పెన్ పవర్  ఫిబ్రవరి 20,  నీటిని చూస్తే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ పులకించిపోతారు. అందులోనూ బీచ్ లో గడపటమంటే ఏ మాత్రం వెనకాడరు. అలలు చూస్తే ఇక వయసు ఆగదు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న బీచ్ లకు వెళ్లి అక్కడే గంటల కొద్దీ గడిపే వారు ఎంతో మంది ఉన్నారు. దీని వల్ల...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  ప్రకాశం / Prakasam 

భారీగా మద్యం పట్టివేత

భారీగా మద్యం పట్టివేత కొనకనమిట్ల పెన్ పవర్ ఫిబ్రవరి 11 ; మండల కేంద్రమైన కొనకనమిట్ల మీదుగా పలు గ్రామాలకు అక్రమంగా తరలిస్తున్న మద్యం మంగళవారం పెద్ద ఎత్తున పట్టుబడింది.జిల్లా ఎక్సైజ్ అధికారులకు అందిన సమాచారం మేరకు జిల్లా ఎక్సైజ్ బృందం తమ సిబ్బందితో కలిసి కొనకనమిట్ల నుండి గ్రామాలకు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెంబడించి పట్టుకున్నట్లు తెలియచేశారు.వాహనంలో ఉన్న...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ప్రకాశం / Prakasam 

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 18:విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఆస్తి నష్టం వాటిల్లింది. పుల్లల చెరువు మండల కేంద్రం అంజనాపురంలో కలివెలపల్లి వీరనారాయణ కు 5 లక్షల 84వేలు మేర ఆస్తి నష్టం వాటిల్లిందని వీఆర్వో కోటేశ్వరావు తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌తో ఆదివారం రాత్రి 10గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఇంట్లో...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ప్రకాశం / Prakasam 

మండల కన్వీనర్ గా సత్తిరెడ్డీ..? 

మండల కన్వీనర్ గా సత్తిరెడ్డీ..?  పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 17: పుల్లల చెరువు వైసీపీ మండల కన్వీనర్ పదవికి సత్తిరెడ్డీ పేరు బయటికీ రావడంతో మండలంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ పార్టీ అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ స్థానిక శాసనసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ అభ్యర్థి పోటీ చేసిన వారి...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ప్రకాశం / Prakasam  సాధారణ వార్తలు 

బిర్సా ముండా ఎందరికో ఆదర్శం.

బిర్సా ముండా ఎందరికో ఆదర్శం. పుల్లలచెరువు పెన్ పవర్ నవంబర్ 15: పుల్లల చెరువు మండలం గారపెంట నరజాముల తండా పంచాయితి మురికిమళ్ళ తండా గిరిజన గ్రామాల్లో గిరిజన నాయకుడు స్వతంత్ర సమరయోధులు భగవాన్ బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహీంచారు. ఈ సందర్భంగా పుల్లలచెరువు ఈ వార్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ప్రకాశం / Prakasam 

సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి

సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 15: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని పుల్లల చెరువు ఎస్సై సంపత్ కుమార్ అన్నారు. పుల్లల చెరువు మండలం పీవీ పల్లి, కొత్తూరు గ్రామలల్లో సైబర్ నేరాలు, డయల్ 100, సీసీ కెమెరాలు తదితర అంశాలపై అవగాహన  కలిగి ఉండాలని ఎస్సై అన్నారు.ఈ సందర్భంగా...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ప్రకాశం / Prakasam 

బెల్ట్ షాపుల పై పోలీసుల దాడి

బెల్ట్ షాపుల పై పోలీసుల దాడి పుల్లలచెరువు పెన్ పవర్ నవంబర్ 14:పుల్లలచెరువు మండలం రెంటపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్ట్‌ షాపు పై పుల్లలచెరువు ఎస్ఐ సంపత్ కుమార్ గురువారం  దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మారబోయిన నాగార్జున ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఎనిమిది బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై సంపత్...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  ప్రకాశం / Prakasam 

మిర్చి పంటకి తెగుళ్లు.. రైతుకు కన్నీళ్లు

మిర్చి పంటకి తెగుళ్లు.. రైతుకు కన్నీళ్లు వైరస్ దెబ్బతో విలవిల చీడపీడల దాడితో దిక్కుతోచని స్థితితో తగ్గనున్న దిగుబడులు మిరప పంటకు ఆకుముడుత వ్యాప్తి పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 14:ఈ ఏడాది మంచి దిగుబడితో అధిక లాభాలు తెచ్చిపెడుతుందని ఆశించిన మిర్చి రైతులకు బొబ్బార వైరస్ తో అపార నష్టం తెచ్చిపెట్టింది.ఆకు ముడత తెగుళ్ళు కారణంగా పుల్లల చెరువు మండలంలో...
Read More...