శ్రీశైలంలో మరో పురాతన శివలింగం
భ్రమరాంబా సమేతుడై మల్లికార్జున స్వామి వెలసిన..ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మరో పురాతన శివలింగం బయటపడింది.. దేవస్థానం యాఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడినట్టు అధికారులు తెలిపారు.
శ్రీశైలంలో ఆశ్యర్యకర ఘటన
బయటపడింది చూసి ఆశ్చర్యంలో జనం
సపోర్ట్ వాల్ నిర్మాణానికి తవ్వకాలు..
శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం, నంది విగ్రహం
ఆశ్చర్యానికి లోనైన భక్తులు
శివలింగం పక్కనే రాయిపై కొన్ని గుర్తులతో లిపి,
14, 15వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తింపు
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మరో పురాతన శివలింగం బయటపడింది.. దేవస్థానం యాఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడినట్టు అధికారులు తెలిపారు.. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా శివలింగం బయటపడిన వార్త తెలియడంతో భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివస్తున్నారు. మహిళలు పూజలు చేస్తున్నారు. సమాచారం అందడంతో… శ్రీశైల దేవస్థాన అధికారులు, పురోహితులు అక్కడికి వచ్చి శివలింగాన్ని పరిశీలించారు. శివలింగంతో పాటు అదే రాయిపై నంది విగ్రహం కూడా ఉంది.. మరోవైపు.. శివలింగం పక్కనే రాయిపై తెలియని లిపితో రాసి ఉన్న గుర్తులు ఉన్నాయి.. బయటపడిన శివలింగాన్ని పరిశీలించిన దేవస్థానం అధికారులు.. శివలింగం దగ్గర ఉన్న లిపిని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు పంపించారు.. దానిపై అధ్యయనం చేసిన అధికారులు.. బయటపడిన పురాతన శివలింగం వద్ద ఉన్న లిపి 14, 15వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు.. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని చక్ర గుండం వద్ద ప్రతిష్టించినట్లు లిపిలో ఉన్నట్టు వెల్లడించారు.. మైసూరుకు చెందిన ఆర్కియాలజీ అధికారుల ద్వారా లిపిలో ఉన్న సమాచారం గుర్తించారు అధికారులు..