గార్ల, పెన్ పవర్, ఆగస్టు6:
తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ శాశ్వతంగా నిలిచిపోయారని గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పార్వతీ నాయక్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని గురువారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలోని జయశంకర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాల్లపెల్లి కృష్ణ గౌడ్ సర్పంచ్ పార్వతీ నాయక్ లు జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారని తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలను తెలంగాణ ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి సంకల్ప బలం రాష్ట్ర సాధనకు చేసిన నిర్విరామ కృషి అంచ లంచలుగా ఆశయ ఆలోచనలకు పదును పెడుతూ, రాష్ట్ర సాధనకు ఆయువుపట్టు అయ్యి అందరి హృదయాలలో నిలిచారని ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్యా నాగేశ్వరరావు హతీరాం వార్డు సభ్యులు తోడేటి శ్రీనివాస్ ఇమ్రాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ కే యాకుబ్ బాషా కోలకుమార్ రాజశేఖర్ దీకోండ రాము గులగట్టు బాబు సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

