గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 4:
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలన అంతా మోసపూరితమేనని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజా పాలన పేరుతో మోసపూరిత పాలన చేస్తున్నాడని ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలలో విఫల పాలనను నిరసిస్తూ గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ కూడలిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి1000 రోజులు గడిచినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వాగ్దానాలను హామీలను నెరవేర్చకుండా మోసం చేశాడని విమర్శల వర్షం కురిపించారు.ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన వాగ్దానాలలో తులం బంగారం, మహిళలకు నెలకు రూ. 2,500 భృతి, విద్యార్థినులకు ఉచిత స్కూటీల పంపిణీ వంటి కీలక హామీలను పక్కనబెట్టి ప్రజలను మోసం చేశారని మాజీ సీఎం కేసీఆర్ హయాంలో అమలు చేసి ఎంతో ఆదరణ పొందిన బీసీ బంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్, పెన్షన్ల పెంపు వంటి ప్రజాకర్షక పథకాలను నిలిపివేసి ప్రభుత్వం పేదల నట్టేట ముంచిందన్నారు దివ్యాంగులకు, వృద్ధాప్య పింఛన్లు పెంచుతామని ప్రకటించి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి బకాయి ఉందనే విషయం గుర్తులేదా అని ఆమే ప్రశ్నించారు. ప్రతి నెలా మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు కొనసాగిస్తుందని ప్రజలకు ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గర్భిణితో ఉన్న ఆమె కు బిఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు బుడిగ శ్రీదేవి భూక్య సంధ్య సరిత ఉమా నిర్మల పద్మ లు సీమంతం చేసి సారే బహూకరించి దీర్ఘ సుమంగళి తో పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్తో ఆరోగ్యకరంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్ మహబూబాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆంగోతు బిందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్ రంగనాథ్ దేవిలాల్ ఉద్యమకారులు గట్టు అనంతరాములు బిక్షమయ్య గార్ల బిఆర్ఎస్ మండల నాయకులు గ్రామ పట్టణ శాఖ మాజీ అధ్యక్షులు కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

