గూడెంకొత్తవీధి,పెన్ పవర్,జూన్ 10:అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం గూడెంకొత్తవీధి మండలంలో తెలుగుదేశం పార్టీ మండల బాడీ సమావేశం బుధవారం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు, ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై తీర్మానాలు చేశారు.మండలంలోని 16 పంచాయతీల పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, తారు రోడ్లు, తాగునీటి సదుపాయాలు, సాగునీటి వసతులు, చెక్‌డ్యాంల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాల నిర్మాణం వంటి అంశాలపై తీర్మానాలు ఆమోదించారు. అలాగే జీకేవీధి మండల కేంద్రంలోని కళ్యాణ మండపానికి మంచినీటి బోరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రత్యేక తీర్మానం చేశారు.రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నెల రెండో బుధవారం మండల బాడీ సమావేశం నిర్వహించి, ప్రజా సమస్యలు మరియు అభివృద్ధి ప్రతిపాదనలకు సంబంధించిన తీర్మానాలను రాష్ట్ర పార్టీ అధిష్ఠానానికి పంపిస్తున్నామని మండల అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు తెలిపారు.ఈ సమావేశంలో చింతపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మొట్టడం శెరభన్నదొర, మాజీ జడ్పీటీసీ గంట నళిని కృష్ణ, ఎం. భూపతి, ఎం. సంతోష్, ఎం. రాజుబాబు, కాకూరి వెంకటరమణ, కొర్ర రాంబాబు, జి. నాగేశ్వరరావు, జి. సత్యనారాయణ, ఎం. గంగరాజు, ఎం.వి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, ఎం. రాంబాబు, ఎం. కామరాజు, వి. వెంకటేశ్వర్లు, శెట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం:టీడీపీ మండల బాడీ సమావేశంలో తీర్మానాలు
RELATED ARTICLES

