Homeఆంధ్రప్రదేశ్పోలవరంపల్స్ పోలియో బూత్‌ల కుదింపును వెంటనే ఉపసంహరించుకోవాలి

పల్స్ పోలియో బూత్‌ల కుదింపును వెంటనే ఉపసంహరించుకోవాలి

📰 Generate e-Paper Clip

పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి

ఉపసంహరించుకోకపోతే బహిష్కరిస్తాం

: సీఐటీయూ డిమాండ్

రంపచోడవరం, జూన్ 27 (పెన్ పవర్): పోలవరం జిల్లాలో పల్స్ పోలియో బూత్‌ల సంఖ్యను తగ్గించడం గిరిజన ప్రాంతాల చిన్నారుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాల మధ్య ఎక్కువ దూరం, రవాణా సౌకర్యాల లేమి కారణంగా తల్లులు పిల్లలను బూత్‌లకు తీసుకురావడం కష్టమవుతుందని, దీంతో అనేక మంది చిన్నారులు పోలియో చుక్కలకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. బూత్‌ల కుదింపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని, గతంలో మాదిరిగానే అన్ని గ్రామాల్లో పోలియో బూత్‌లను కొనసాగించాలని డిమాండ్ చేశారు.

అలాగే మారుమూల గిరిజన గ్రామాల కోసం ప్రత్యేక మొబైల్ వ్యాక్సినేషన్ బృందాలను ఏర్పాటు చేయాలని, ఆశా, అంగన్‌వాడీ, ఆరోగ్య సిబ్బందికి రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే పల్స్ పోలియో కార్యక్రమాన్ని బహిష్కరించి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular