గార్ల, పెన్ పవర్, జులై 28:
గార్ల మండల కేంద్రంలో ప్రజానాట్యమండలి రాష్ట్రస్థాయి పాటల శిక్షణ తరగతులు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రారంభ సూచికగా జెండా ఆవిష్కరణ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు అలవాల రామకృష్ణ ఆవిష్కరించారు.అనంతరం ఏర్పాటు చేసిన ప్రారంభ సభ ప్రజానాట్యమండలి మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి నక్క సైదులు అధ్యక్షతన జరిగింది ఈ సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజావ్యతరక విధానాలను ప్రజల్లోకి తీసుకపోవడంలో ఈ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని వారు అన్నారు కేంద్రంలో అధికారులు ఉన్న బిజెపి కార్మికులను కర్షకులను రైతులను వర్గ పోరాటాలకు రాకుండా హిందూ ముస్లిం అంటూ కులాల పేరుతో విడగొడుతూ తమ పబ్బం గడుపుకుంటుందని వారు విమర్శించారు. సనాతన ధర్మం పేరుతో కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి మత ఘర్షణ సృష్టించడం బిజెపి నైజం అని అన్నారు మూడవిశ్వాసాలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చైతన్య పూర్తయిన గ్రామాల్లో ప్రజా చైతన్యాన్ని కలిగించటమే ప్రజానాట్య మండలి కర్తవ్యమన్నారు.ప్రజల్లో వర్గ చైతన్యం వర్గ పోరాటాలను నిర్వహించడంలో కళాకారులు తమ ముఖ్యమైన పాత్రను నిర్వహించాలని వారు గుర్తు చేశారు.రాష్ట్రంలో అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీలు కూడా సక్రమంగా అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం సాంస్కృతిక రంగాన్ని పూర్తిగా విస్మరించిందని వారు విమర్శించారు అర్హత కలిగిన కళాకారులను గుర్తించి సంక్షేమ పథకాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు కార్మికులు కర్షకులు చేస్తున్న వర్గ పోరాటాలను కళాకారులు బాసటగా నిలవాలని అన్నారు ఈ ప్రారంభ సభలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ జే వినోద్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల ఆనందు రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల సదానందo కొండూరి భాస్కరు బూర్గుల ప్రభాకర్ నామ లక్ష్మీనారాయణ కుమ్మరి శంకర్ సంగు నాగేంద్ర పవన్ కుమార్ దువ్వా సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

