గార్ల, పెన్ పవర్, ఆగస్టు 4:
నవజాత శిశువులకు తల్లి పాలు అమృత తుల్య మైనవని,పిల్లలకు తల్లి పాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పలు రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని తల్లి పాలే బిడ్డ కు శ్రేయస్కరం అని జిల్లా సంక్షేమ అధికారి కే శిరీష అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని బాలాజీ తండా అంగన్ వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమమైన పౌష్టికాహారం తల్లి పాల నుండే లభిస్తుందని, తల్లి పాలు ఇవ్వడం వలన అటు పిల్లలకు ఇటు తల్లి కి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పిల్లలకు రోగనిరోధక శక్తి లభించాలంటే తల్లి పాలు పట్టించాలని, తల్లి పాల అవశ్యకత ను ముర్రుపాల ప్రాముఖ్యతను బాలింత లు, గర్భిణులకు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బట్టు అనిత ఉప సర్పంచ్ బాలు సిడిపిఓ లక్ష్మి కార్యదర్శి ప్రశాంతి సూపర్వైజర్ సంపూర్ణ అంగన్వాడి టీచర్లు గర్భిణీలు బాలింతలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

