గార్ల పెన్ పవర్ ఆగస్టు 4:
వర్షాకాలం నేపథ్యంలో అన్ని గ్రామాలలో వైద్య అధికారులు వైద్య శిబిరoలో ఉండి వైద్య శిబిరాలు నిర్వహించి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి.శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక ఐతపు మంగపతి రావు భవనంలో బొబ్బ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటికే వర్షాలు ప్రారంభమై సీజనల్ వ్యాధులు ప్రభలుతున్నాయని, కొన్నిచోట్ల వైద్య శిబిరాలలో వైద్యాధికారి లేకుండా,వైద్య సిబ్బంది మాత్రమే పరీక్షలు నిర్వహించి తూ తూ మంత్రంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు. మండల కేంద్రంలో ఉన్న అన్ని వసతి గృహాలలో విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి అన్ని రకాల మందులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.అన్ని గ్రామాలలో డ్రై నీజిల్లో చెత్త పేరుకుపోయి, దోమలు స్వైర విహారం చేసే అవకాశం ఉన్నాయని వెంటనే అన్ని గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్, పారిశుధ్య పనులు, డ్రైనేజీ పూడిక తీత పనులు, అన్ని వాటర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ పనులు చేపట్టాలని పంచాయతీ అధికారులను డిమాండ్ చేశారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని గ్రామా లలో వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు గడ్డిపాటి రాజారావు, వీ పి వెంకటేశ్వర్లు, మల్లెల నాగమణి, చింత ఎల్లయ్య, సిహెచ్ బాబు, సిహెచ్ మౌనిక, కె.రామకృష్ణ, ఎ.రామకృష్ణ, తదితరులు ఉన్నారు.

