15000 కోట్ల రూపాయల నిధుల నిగ్గు తేల్చాలి
బీసీవై పార్టీ పాడేరు ఇంచార్జ్ కిల్లో రాజన్
స్టాఫ్ రిపోర్టర్:మాదిరి చంటిబాబు,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జులై 6: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పీవీటిజి సామాజిక వర్గ అభివృద్ధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ద్వేయంగా 15000 కోట్ల రూపాయల నిధులను కేటాయించటం జరిగిందని బీసీవై పార్టీ పాడేరు ఇంచార్జ్ కిల్లో రాజన్ తెలిపారు.కానీ గత వైసిపి ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టించి తీవ్ర అన్యాయం చేసిందని, నిధులను స్వాహా చేసిందని ఆరోపించారు.ఒకవేళ నిధులను దుర్వినియోగం చేసి ఉండకపోతే కనీసం కొన్ని గ్రామాలైన మౌలిక సదుపాయాలు కలిగి ఉండేది. గత వైసిపి ప్రభుత్వం నామమాత్రంగా కొన్ని గ్రామాలలో అరకోరగా సిమెంటు రోడ్లు వేసి చేతులు దులుపుకున్నారు.అమాయక పివిటీజీ కుటుంబాలను మసిపూసి మారేడు కాయ చేసి ఓట్లు గుంజుకుని గాలికి వదిలేసారని దుయ్య బట్టారు. దీనికి బాధ్యులైన గత ఎమ్మెల్యే,ఎంపీ,మంత్రులు ఏ ఏ గ్రామానికి ఎంత ఖర్చు పెట్టారో తక్షణమే లెక్క చెప్పాలి అని, ఎన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించారో పీవీటిజి సామాజిక వర్గానికి వివరించాలని డిమాండ్ చేశారు.లేనిచో ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సంబంధిత అధికారులను, ప్రజా ప్రతినిధులను న్యాయ విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చీటింగ్ కేసు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలి లేనిచో భారీ ఎత్తున ఉద్యమం చేపడతాం, పివిటిజి సామాజిక వర్గం తరఫున న్యాయం కోసం బీసీవై పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం జరిగే వరకూ పోరాడుతుందని హెచ్చరించారు.నాడు15000 కోట్లు నేడు పీఎం జాన్ మాన్ నిధులు ఏమి అయ్యాయో తేలటం లేదన్నారు.విద్య వైద్యం సామాజిక ఆర్థిక ఉద్యోగ ఉపాధి రాజకీయ వివిధ రంగాల్లో వెనుకబడిన పివిటిజి సామాజిక వర్గం గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు కేటాయించింది వాస్తవమా కాదా! లేదంటే తమ పేరు ప్రఖ్యాతల కోసం పత్రికా ప్రకటనల వరకే పరిమితమా! దేవుడు వరమిచ్చినా పూజారి కనుకరించలేదన్న సామెత అమలు అవుతుందా!దేవుడు పేరు చెప్పి దెయ్యాలు తింటున్నాయా అనే అనుమానం వాటిల్లుతోందని ప్రశ్నించారు.పీఎం జాన్ మాన్ పేరుతో గ్రామాల్లో సర్వే నిర్వహించి కొన్ని గృహాలు మంజూరు చేశారు. కొంతవరకు పేమెంట్లు ఇచ్చారు అనంతరం మధ్యలో నిలిపివేశారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ విధుల మీద ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. పివిటిజి సామాజిక వర్గానికి కేటాయించిన నిధులు ధర్మబద్ధంగా వారికే చెందాలని డిమాండ్ చేశారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.