ePaper
Sunday, May 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంతిమ్మాపురంలో ప్రజా దర్బార్..

తిమ్మాపురంలో ప్రజా దర్బార్..

📰 Generate e-Paper Clip

 

అడ్డతీగల, పెన్ పవర్ ,మే 22; అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామంలో ఎమ్మెల్యే మిరియాల. శిరీష దేవి అధ్యక్షతన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తిమ్మాపురం గ్రామంలో వాటర్ ట్యాంకు శంకుస్థాపన చేశారు. ప్రజలు పరిశుభ్రమైన మంచినీటి సదుపాయం అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తుందని ,ఎమ్మెల్యే శిరీష దేవి అన్నారు. ఈ సందర్భంగా ప్రజా దర్బార్ లో త్రాగునీరు, రహదారులు ,విద్యుత్తు, సంక్షేమ పథకాలు అమలు వంటి విషయాలు గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గొండోలు సచివాలయానికి పీఎం జే యు జి పథకం కింద 3.16 లక్షల ఖర్చుతో కరెంటు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular