ePaper
Thursday, May 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడమంజేరు గ్రామానికి మహర్ధశ

మంజేరు గ్రామానికి మహర్ధశ

📰 Generate e-Paper Clip

30 ఏళ్ల చిరకాల కోరిక

మంజేరు-శలపాక బీటీ రోడ్డు
మంత్రి ఆధ్వర్యంలో శాశ్వత బ్రిడ్జి ఏర్పటు
పలు గ్రామాల ప్రజలు హర్షం
కాజులూరు ,పెన్‌పవర్‌,మే20ః మండల పరిధిలోని మంజేరు-శలపాక వంతెన వరకు రూ.3 కోట్ల నాబార్డు నిధులతో రోడ్డు కం బ్రిడ్జి పనులకు సంబంధించి ఇటీవల రాష్ర్ట కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ శంకుస్థాపనచేశారు.సంబంధిత కాంట్రాక్టర్‌ వెనువెంటనే బ్రిడ్జిపనులు ప్రారంభించడంతో స్థానిక మంజేరు ప్రజల కళ్లల్లో చిరునవ్వులు మొదలయ్యాయి.మాజీ మంత్రి చిక్కాల రామచంద్రవావు ఆధ్వర్యంలో 30 ఏళ్ల క్రతం మాజీ సర్పంచ్‌ దడాల సుబ్బలక్ష్మి హయాంలో గ్రావెల్‌ రోడ్డు వేయడం జరిగింది.నాటి నుండి నేటివరకు ఆ రోడ్డు ఎక్కడా చెక్కు చెదరలేదు.ఈ రోడ్డు ప్రధానంగా మంజేరు,శలపాక,గొర్రిపూడి,గ్రామాలకు అనుసందానం చేయబడింది.నాటి నుండి నేటి వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు,మంత్రులను బీటీ రోడ్డు నిర్మాణం కోసం అడగని రోజులు లేవు.దొమ్మేటి వెంకటేశ్వర్లు,తోట త్రిమూర్తులు ప్రస్తుత ఎమ్మెల్సీ,మాజీ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ,మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తదితరులు వినతులు స్వీకరించారు తప్ప రోడ్డు నిర్మాణం వీరి హయాంలో చేయలేకపోయారు.రామచంద్రపురం నియోజకవర్గానికి కొత్తగా అమలాపురం నుండి వచ్చి తొలిసారిగా ఎమ్మెల్యే,వెనువెంటనే మంత్రి కావడం,గ్రామ గ్రామాన తిరిగి ప్రజల దీర్ఘకాల సమస్యలను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా మండలంలోని ప్రధాన సమస్యలను జల్లెడపట్టారు. నాడు ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒకటైన మంజేరు రోడ్‌ కం బ్రిడ్జి పనులు పూర్తి చేయడంతో ఆ గ్రామస్తులకు మహర్ధపట్టింది. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి తనియేలు వద్ద ,కూరాడ కెనాల్‌ కాలువపై బ్రిటీష్‌ వారు నిర్మించిన బ్రిడ్జి కు ఆనుకుని 5 మీటర్ల వెడల్పుతో కొత్త బ్రిడ్జీకి శ్రీకారం చుట్టారు.ఒక బ్రిడ్జీపై చిన్నవాహనాలు వెల్లేందుకు ,కొత్త బ్రిడ్జీపై పెద్ద వాహనాలు వెల్లేందుకు భారీ బడ్జెట్‌తో బ్రిడ్జినిర్మాణపు పనులు చకచక నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాతబ్రిడ్జి,మరల ఏరులో పూర్తిగా నీరు,షిల్ట్‌ తొలగించి వ్యవసాయదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏటి నీరు ప్రహాం జరగకుండా మట్టి అడ్డా వేయడం జరిగింది.అలాగే బ్రిడ్జి నిర్మాణానికి అడ్డుగా ఉన్న 33 కెవి పోల్స్‌ను కూడా కాంట్రాక్టర్‌ పక్కకు మార్పిండం జరిగింది.దీంతో బ్రిడ్జి పనులకు ఎటువంటి ఆటంకం లేదు.బ్రిడ్జి పూర్తికాగానే రోడ్డు పనులు మొదల వుతాయని సంబంధిత కాంట్రాక్టర్‌,స్థానిక కూటమి నాయకులు ఎంపీటీసీ గండి మణికంఠ,దడాల నాగార్జున,పుణ్యమంతుల రామకృష్ణ,ఎర్రంనీడి గోవిందు,తదితరులు తెలిపారు.జూన్‌ నెలాఖరు లోపులో బ్రిడ్జిపనులు పూర్తికావడం జరుగుతుందని కూటమి నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మొగలపాలెం -మంజేరు బ్రిడ్జికి అనుసందానం చేస్తూ మార్కెటింగ్‌ యార్డు నిధులతో కూరాడ కెనాల్‌ గట్టు పొవడునా ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ దడాల నాగేశ్వరి నాగార్జున ఆధ్వర్యంలో గ్రావెల్‌ రోడ్డు వేయడం జరిగింది.అంతకు ముందు మొగలిపాలెం గ్రామం నుండి కొంత మేర శలపాక నీటిసంఘం అధ్యక్షులు తాడి రామారెడ్డి కృషితో ఉపాధి హామీ పథకం నిధులతో సిసీరోడ్డు వేయడం జరిగింది.దీంతో మంజేరు- మొగలిపాలెం గ్రామస్తులకు , వ్యవసాయ దారులకు కొంత ఊరట కలిగింది. అలాగే మంజేరు-శలపాక రోడ్డుకు తణుకువాడ,శలపాక,గొర్రెపూడి, పటవల, శీల తదితర గ్రామాలు అనుసంధానం చేయడం జరిగింది.ప్రస్తుతం మంజేరు బ్రిడ్జి-శలపాక బ్రిడ్జి రోడ్డు నిర్మాణం పూర్తి అయితే
10 గ్రామాల ప్రజలకు ఎంతో దోహదపడుతుందని స్థానిక ప్రజలు మంత్రి చేస్తున్న అభివృద్దిపనులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 


ప్రధానంగా మంజేరు గ్రామం అభివృద్ది జరుగుతుందంటే దానికి ప్రధాన కారణం దడాల నాగార్జున,కూటమి నాయకులు కృషి లేకపోలేదు. ఎన్నోసార్లు మంత్రి సుభాష్‌కు విన్నవించుకోవడం జరిగింది.బ్రిడ్జి,రోడ్డు పూర్తికావాలంటూ నాగార్జున పట్టువదని విక్రమార్కుడులా మంత్రి వెంటే ఉన్నారు.ఆ ఫలితమే నేడు మంజేరు గ్రామస్తులందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల గ్రామాల్లో రోడ్డు నిర్మాణాలు జరగడంతో గ్రామాల్లో కూటమి ప్రభుత్వం పై ఒక నమ్మకం ఏర్పడింది.ఈ రోడ్‌ నిర్మాణం మంజేరు గ్రామస్తుల చిరకాల వాంఛ.దానిని సార్ధకం చేసి చూపిన వ్యక్తి వాసంశెట్టి సుభాష్‌…దాంతో శభాష్‌ అనిపించకున్న మంత్రి. మంజేరు -శలపాక రోడ్డు నిర్మాణం చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు,ఇటు యానం వెల్లేందుకు వాహన దారులకు ఈ రహదారి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.అంతేకాక వేల ఎకరాల వ్యవసాయ దారులకు, ఆక్వా రైతులకు, ఆయా గ్రామాల ప్రజలకు ఎంతో దోహదపడుతుందని స్థానిక గ్రామాల ప్రజలు సంతోషిస్తున్నారు.

హర్షం వ్యక్తం చేస్తున్నవారిలో శలపాక ఎంపీటీసీ దడాల రమేష్‌,మాజీ సర్పంచ్‌ పోతుల గనిరాజు, పోతురాజు భీమారావు,పోతురాజు అప్పారావు సొసైటీ డెరెక్టర్‌,గరగ అర్జిబాబు,సూరంపూడి భాను,మాజీ సర్పంచ్‌ గుంటూరి అప్పారావు , చుండ్రు రుద్రరావు చౌదరి,ఎం.గోవింద్‌రెడ్డి,మాధవరపు దొరబాబు,గండి శ్రీను,తదితరులు

         దడాల ఏడుకొండలు,పెన్‌పవర్‌ ప్రతినిధి-కాకినాడ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular