Homeతెలంగాణటూరిస్ట్ బస్సు, డీసీఎం ఢీ.. ఒకరి మృతి

టూరిస్ట్ బస్సు, డీసీఎం ఢీ.. ఒకరి మృతి

ఖమ్మం, పెన్ పవర్, జూలై 21:

ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్ రోడ్డులో, ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వచ్చిన డీసీఎం వ్యాన్ ఎదురుగా హైదరాబాద్ వైపు వెళ్తున్న టూరిస్ట్ బస్సును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు డీసీఎం వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. టూరిస్ట్ బస్సు ముందు భాగం కూడా నుజ్జునుజ్జయింది. డీసీఎంలో డ్రైవర్తో పాటు మరో పదిమంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వారంతా స్వల్ప గాయాలతో బయట పడినట్లు తెలిసింది.
ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో మరింత ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మృతుని వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular