Homeతెలంగాణమహబూబాబాద్లింక్ కెనాల్ సర్వేలను రద్దు చేయాలి

లింక్ కెనాల్ సర్వేలను రద్దు చేయాలి

గార్ల పెన్ పవర్ జులై 21:

మున్నేటిలో పుష్కలంగా నీరున్నా మహబూబాబాద్‌ జిల్లా గార్ల, బయ్యారం మండలాలను ఎడారిగా మారుస్తూ స్థానిక ప్రజలను వంచిస్తూ చేపడుతున్న ‘మున్నేరు-పాలేరు లింక్ కెనాల్’ సర్వేలను తక్షణమే రద్దు చేయాలని గార్ల మండల మాజీ ఎంపిటిసి శీలంశెట్టి రమేష్ మంగళవారం ప్రకటనలో డిమాండ్. ఈ సందర్భంగా ఆయన పెన్ పవర్ ప్రతినిధితో మాట్లాడారు. ప్రస్తుత కాలంలో మునుపెన్నడూ లేనివిధంగా ‘సూపర్ ఎల్ నియో’ ప్రభావం తీవ్రరూపం దాల్చుతోందని. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని గార్ల బయ్యారం మండలాలు తీవ్రమైన కరవు ఛాయల్లో చిక్కుకున్నాయని.
ఒకవైపు వానలు లేక చెరువులు, కుంటలు ఎండిపోతుంటే, మరోవైపు ఈ ప్రాంతానికి జీవనాడిగా మారాల్సిన మున్నేటిలో మాత్రం ఎలాంటి వర్షాలు లేకపోయినా ప్రస్తుతం 300 నుంచి 400 క్యూసెకల నీటి లభ్యత స్పష్టంగా ఉందన్నారు​మున్నేటిలో నీరు ప్రవహిస్తున్నప్పటికీ, స్థానిక గార్ల, బయ్యారం ప్రాంత ప్రజలకు ఆ నీటిని ఒక్క చుక్క కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోందని ఇక్కడి రైతుల దాహార్తిని పట్టించుకోని పాలకులు.. ఈ ప్రాంత ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ‘మున్నేరు-పాలేరు లింక్ కెనాల్’ ప్రాజెక్ట్‌కు మాత్రం సర్వేలు చేయడం, డీపీఆర్‌లు తయారు చేయడం, బడ్జెట్ కేటాయించడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ వినాశకర ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించాల్సిన ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి రైతులు ఈ లింక్ కెనాల్ ప్రతిపాదనను అంగీకరించారంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అబద్ధపు, సంకుచిత నివేదికలు ఇవ్వడం దారుణాతి దారుణమన్నారు. సొంత నియోజకవర్గ రైతుల గొంతు కోస్తూ, వారి పొట్ట కొట్టేలా పాలకులకు వత్తాసు పలుకుతున్న ప్రజాప్రతినిధుల తీరు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉందన్నారు.
రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి స్వార్థ రాజకీయాలు చేస్తున్న వారి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు​. సొంత ప్రాంత ప్రజల తాగు, సాగునీటి అవసరాలను గాలికొదిలేసి, వేరే ప్రాంతాలకు నీటిని తరలించే ఈ కుట్రలను ఏ మాత్రం సహించేది లేదనిగార్ల, బయ్యారం మండలాల ప్రజల శాశ్వత నీటి భద్రత కోసం ప్రభుత్వం వెంటనే కింది చర్యలు తీసుకోవాలన్నారు.
​స్థానిక ప్రజల హక్కులను కాలరాస్తూ, మున్నేరు నీటిని అన్యాయంగా తరలించాలని చూస్తే ఊరుకునేది లేదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఇల్లెందు స్థానిక ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి ‘మున్నేరు-పాలేరు లింక్ కెనాల్’ ప్రతిపాదనలను విరమించుకోవాలని, మున్నేరు నీటిని నేరుగా గార్ల, బయ్యారం చెరువులకే మళ్లించాలని లేనిపక్షంలో గార్ల, బయ్యారం మండలాల సర్వజనులను, రైతన్నలను ఏకం చేసి చరిత్రలో ఎరుగని రీతిలో ప్రత్యక్ష ఆందోళనలు, చేపట్టి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని తీవ్రంగా హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular