గార్ల పెన్ పవర్ జూలై 29:
సర్ కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకోవద్దని అర్హు లైన ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు సర్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ సర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తో కలిసి ఆయన గార్ల మండల కేంద్రంలోని బీఎల్ఎలు కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరి ఓటు హక్కు కాపాడే లా కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసు కోవాలన్నారు. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్త లు, బీఎల్ఎ లు ఇంటింటికి వెళ్లి ఓటును పునరుద్ద రించుకున్నారా లేదా అని ఓటర్లను ఆరా తీయాల న్నారు. ఓటును పునరుద్ధరించకోకుంటే సర్ ఫారాలు భర్తీ చేయించి ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంషాద్ బేగం మాజీ ఏఎంసీ చైర్మన్ భుక్యా నాగేశ్వరరావు గార్ల మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గంగావత్ రామ్ సింగ్ నాయక్ గార్ల సర్పంచ్ బానోత్ పార్వతి హతిరాం నాయక్ చిన్న బంజర సర్పంచ్ మోతిలాల్ సర్పంచ్ రామ్ సింగ్ ముల్కనూర్ సర్పంచ్ వెంకట్రావు సీతంపేట సర్పంచ్ వీరియానాయక్ పిన్ రెడ్డిగూడెం సర్పంచ్ వీరన్న శేరిపురం సర్పంచ్ భారతి చిన్న కృష్టాపురం సర్పంచ్ బద్రునాయక్ అన్ని గ్రామాల ఉపసర్పంచ్ లు బూత్ కమిటీ ఏజెంట్లు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

