Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లివిద్యార్థులు, మహిళల భద్రతకు ‘అభయ’ కార్యక్రమం

విద్యార్థులు, మహిళల భద్రతకు ‘అభయ’ కార్యక్రమం

విద్యార్థులు, మహిళల భద్రతకు ‘అభయ’ కార్యక్రమం

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్      నక్కపల్లి, ఆగస్టు 13: విద్యార్థినులు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ చేపట్టిన ‘అభయ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా పోలీసు అధికారి తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో భద్రతపై భరోసాను పెంపొందిస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా నక్కపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గురువారం సందర్శించారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభయ ఫిర్యాదుల పెట్టెను ఆమె ప్రారంభించారు. అనంతరం పెట్టెలోని ఫిర్యాదులను పరిశీలించి, విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. విద్యార్థినులకు ధైర్యాన్ని కల్పిస్తూ వారి భద్రతకు అండగా నిలుస్తున్న అనకాపల్లి జిల్లా పోలీసు శాఖను అభినందించారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ సమస్యలను అభయ ఫిర్యాదుల పెట్టె ద్వారా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. విద్యార్థులను వేధించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ స్నేహపూర్వక పోలీసింగ్‌తో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసు అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పతివాడ విజయ, పోలీసు ఇన్‌స్పెక్టర్లు మురళి, రామకృష్ణ, వినోద్‌బాబు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular