పది పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కి పాల్పడితే చర్యలు:ఐటిడిఏ ఇన్చార్జి పిఓ,జెసి డా.ఎం.జె.అభిషేక్ గౌడ
స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఫిబ్రవరి 24: పది పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కి పాల్పడితే కఠిన చర్యల తీసుకుంటామని ఐటిడిఏ ఇన్చార్జి పి. ఓ. జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ హెచ్చరించారు. పాఠశాలలకు మంచి ఫలితాలు రావాలని మాస్ కాపీయింగ్ కి ప్రోత్సహిస్తే సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామన్నారు. పది పాస్ చేయిస్తామని విద్యార్థుల దగ్గర తలిదండ్రుల దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తే ఉపేక్షించనన్నారు. సోమవారం ఐటిడి ఏ సమావేశ మందిరంలో 11 మండలాల ఎటిడబ్ల్యూ ఓలు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గురుకుల ప్రిన్సిపాల్స్తో సమావేశం నిర్వహించారు. పివి ఓగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇప్పటి వరకు 10 ఆశ్రమ పాఠశాలలు తనిఖీ చేసానని, సాయంత్రం ఐదు గంటలకు ఆశ్రమ పాఠశాలలు తనిఖీకి వస్తే ఉపాధ్యాయులు ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సూరవైజరీ సబ్జెక్టు టీచర్లు అందుబాటులో ఉండటం లేదన్నారు. ఫ్రెంచి విప్లవం గురించి అడిగితే పది విద్యార్ధులు జవాబు చెప్పలేకపోతున్నారని అన్నారు. కొంత మంది ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని అన్నారు.మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. విద్యార్ధులకు రాగి మాల్ట్ సరఫరా చేయడం లేదని అన్నారు. విద్యార్థుల ప్రమాణాలు ఏ కేటగిరి లో ఉన్నారో ప్రధానోపాధ్యాయులకు అవగాహన ఉండాలన్నారు. మండల విద్యాశాఖాధికారులు
ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్దుల ప్రమాణాలు పరిశీలించాలని జిల్లా విద్యాశాఖాధికారి కి సూచించారు.
విద్యాప్రమాణాలు మెరుగు పరచడానికి ప్రధానోపాధ్యాయులు వారానికి ఒకసారి ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.ఆశ్రమ పాఠశాలల్లో సఖీ గ్రూపులు ఏర్పాటు చేసామన్నారు. సఖీ గ్రూపు సమావేశాలు నిర్వహించి విద్యార్దునుల ఆరోగ్యం, వ్యక్తి గత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని చెప్పారు. రక్తహీనత, బాల్య వివాహాలు, ఫోక్సో చట్టం గురించి వివరించాలని అన్నారు. మార్గదర్శిని అమలు చేసి విద్యార్ధులకు కెరీర్ గైడెన్సుపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.విద్యార్థులు విద్యా సామర్ధ్యాలు మెరుగు పడటానికి ఉపాధ్యాయులు కృషి వేయాలని స్పష్టం చేసారు. 8,10 తరగతుల విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అన్నారు.ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎల్.రజని, జిల్లా విద్యా శాఖాధికారి పి. బ్రహ్మాజీ రావు, ఎపిసి స్వామి నాయుడు 11 మండలాల ఎటిడబ్ల్యూ ఓలు,ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గురుకుల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.