జగ్గంపేటలో 492 కేజీల గంజాయి పట్టివేత.. ఎనిమిది మంది అరెస్ట్

జగ్గంపేటలో 492 కేజీల గంజాయి పట్టివేత.. ఎనిమిది మంది అరెస్ట్

కాకినాడ జిల్లా జగ్గంపేటలో గంజాయి రవాణా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దీనిపై బుధవారం జగ్గంపేట పోలీస్ స్టేషన్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం నుండి జగ్గంపేట ఓ ఇంట్లో ఉంచి తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. 8 మందిని అరెస్టు చేసి రూ.30.50లక్షల విలువ గల 492 కేజీల గంజాయి, ఒక కారు,ఏడు సెల్ ఫోన్లు రూ.రెండు లక్షల 78 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్, జగ్గంపేట ఎస్ఐ టి. రఘునాథరావు, గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, కిర్లంపూడి ఎస్ఐ సతీష్ పాల్గొన్నారు. 

Tags:

About The Author

Advertisement