పాడేరు నియోజకవర్గం నుండి ఆవిర్భావ సభకు సమన్వయకర్తగా గొర్లె వీర వెంకట్ నియామకం

IMG-20250312-WA1452 గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 12: పిఠాపురంలో ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం నుండి సమన్వయకర్తగా అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గొర్లే వీర వెంకట్ ను జనసేన పార్టీ అధిష్టానం నియమించింది. పాడేరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలను సమన్వయ పరుస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలించటం వంటి కార్యక్రమాలను వీరు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వీర వెంకట్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనను ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పాడేరు నియోజకవర్గం నుండి సమన్వయకర్తగా నియమించినందుకు పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అలాగే పాడేరు అసెంబ్లీ, అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ వంపుూరు గంగులయ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని వారు ఇచ్చిన బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని గొర్లె వీర వెంకట్ తెలిపారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.