విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం
పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 18:విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆస్తి నష్టం వాటిల్లింది. పుల్లల చెరువు మండల కేంద్రం అంజనాపురంలో కలివెలపల్లి వీరనారాయణ కు 5 లక్షల 84వేలు మేర ఆస్తి నష్టం వాటిల్లిందని వీఆర్వో కోటేశ్వరావు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో ఆదివారం రాత్రి 10గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న వెండి బంగారం, నల్లపూసల గొలుసులు, లక్ష రూపాయల నగదు,ఫ్రిజ్, కూలర్,బీరువా మొత్తం బుగ్గాయి. క్షణాల వ్యవధిలో ఇల్లు మొత్తం మంటలు వ్యాప్తి చెందటంతో ఇంట్లో ఉన్న వారు వెంటనే అప్రమత్తమై బయటకి పరుగులు పెట్టడంతో ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు.కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. అప్పులు కట్టుకునేందుకు ఇంటిలో భద్రపర్చుకున్న లక్షల నగదు,లక్ష తొంభై వేలు విలువ గల బంగారం, ఒక లక్ష,వెండి,బంగారు ఆభరణాలు, ఎల్ఐసి బాండ్లు, డబల్ కాట్,ఇంటిలో ఉన్న వంట సామాన్లు,నిత్యావసర సరుకులు,బట్టలతో పాటు విలువైన వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.వీఆర్వో బంక కోటేశ్వరరావు నష్టంపై నివేదికను ఉన్నతాధికారులకు అందించారు.ఈ సంఘటనపై తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినట్లు విఆర్వో బంక కోటేశ్వరావు తెలిపారు.