కన్జర్వేషన్ జోన్‌లో..! కార్పోరేట్ పాఠశాల..!

నిర్మాణాలు నిషేధించిన చోటనే.. బౌరంపేట్ "వ్యాసా స్కూల్" బరితెగింపు..

కన్జర్వేషన్ జోన్‌లో..! కార్పోరేట్ పాఠశాల..!

అసలు నిర్మాణాలే చేపట్టకూడని కన్జర్వేషన్ జోన్‌లలో అక్రమ కట్టడాలు, ఆపై కార్పోరేట్ విద్యాసంస్థ పాఠశాల నిర్వహణకు..! ఇటు మున్సిపల్ అధికారులు, అటు విద్యాశాఖ అధికారి బరితెగించి సహకరిస్తున్నారు.. కార్పోరేట్ విద్యాసంస్థల నుండి ముడుపులు దండుకుని, రెండు శాఖల యంత్రాంగం విద్యార్థులను రిస్కులో పెడుతున్నారు.. చట్టాలను నిర్వీర్యం చేస్తూ, నిబంధనలు విస్మరిస్తున్నారు.. అక్రమార్కుల కోసమే ఈ కార్యాలయాలు తెరిచారా అన్న ఆరోపణలు లేకపోలేదు.. బౌరంపేట్ గ్రామ పరిధిలోని కన్జర్వేషన్ జోన్‌లో అక్రమ కట్టడాలతో "వ్యాసా స్కూల్" నిర్వహిస్తున్న యాజమాన్యానికి, దుండిగల్‌ మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ వ్యవస్థ దాసోహం అంటుండగా..! జిల్లా విద్యాశాఖ అధికారులు బహిరంగంగానే బరితెగించి వ్యవహరిస్తున్నారు.. నిర్మాణాలు నిషేధించిన చోట అక్రమ కట్టడాలు చేపడుతుంటే..! తానా తందానా అంటూ విద్యాశాఖ సహకరిస్తుంది.. వార్తలు వచ్చినా పట్టించుకోకుండా లంచావతారులుగా వ్యవహరిస్తున్న మున్సిపల్, విద్యాశాఖ అధికారుల తీరుపై పెన్ పవర్ ప్రత్యేక కథనం..

ZomboDroid_27042025021009
బౌరంపేట్ సర్వే నెం.524, 525, 567 కన్జర్వేషన్ జోన్‌లో "వ్యాసా పాఠశాల"..


మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఏప్రిల్ 27:


సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేసేవిధంగా టౌన్‌ప్లానింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే..! విద్యాశాఖ అధికారులు లంచాలకు అలవాటు పడి, విధులు తాకట్టు పెడుతున్నారు.. మున్సిపల్ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు..! ఫైర్ ఎన్‌వోసి లేకుండానే పాఠశాల నిర్వహణపై విద్యాశాఖ అవగాహన రాహిత్యంతో బరితెగించి సహకరిస్తున్నారు..దుండిగల్‌ మున్సిపల్ బౌరంపేట్ గ్రామంలోని కన్జర్వేషన్ జోన్‌లో "వ్యాసా స్కూల్‌" నిర్వహణపై స్థానికులు ఫిర్యాదు చేసినా, పత్రికల్లో వార్తలు వచ్చినా చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్నారు..  నిర్మాణ అనుమతులకు అవకాశం లేని..! కన్‌‌జర్వేషన్ జోన్‌ వ్యవసాయ భూమిలో "వ్యాసా స్కూల్" యాజమాన్యం విద్యార్థులను ప్రమాదంలో పెడుతున్నారు..గతంలో బౌరంపేట్ వాసులు ఫిర్యాదు చేసి 4 నెలలు గడిచినా నేటికీ చర్యలు శూన్యం.. మరోవైపు వ్యాసా స్కూల్ యాజమాన్యం పత్రికల్లో వార్తలు రాసిన విలేఖరులపై కేసులు పెడతామని, ఇతర విలేఖరులతో బెదిరింపులకు పాల్పడే విధంగా చెప్పడం విశేషం..నిషేధిత స్థలం కన్జర్వేషన్ జోన్‌లో "వ్యాసా స్కూల్" అక్రమంగా నిర్వహిస్తుండటమే గాక, యాజమాన్యం బరితెగించి వ్యవహరించడం గమనార్హం..

IMG_20250427_114032

Tags:

About The Author

MADHAV PATHI Picture

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts