డోలీ మోతలు నివారణకు రాష్ట్ర ప్రభుత్వం సహాకారం: కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్

• రూ. 456 కోట్లతో రోడ్లు అభివృద్ధి, నిర్మాణాలు

• 26 వంతెలన నిర్మాణానికి మంజూరు

• ఉపాధి హామీలో జిల్లా అగ్రస్థానం

స్టాప్ రిపోర్టర్,పాడేరు/ గూడెం కొత్తవీధి,ఏప్రిల్ 3:జిల్లాలో మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించి డోలీ మోతల రహితంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ పేర్కొన్నారు. రూ.456 కోట్లతో రహదారులు అభివృద్ధి, కొత్త రోడ్లు నిర్మాణాలు, 26 వంతెనల నిర్మాణాలను మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేసారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి, ఉపాధికల్పన, మలేరియా నివారణ చర్యలు, ముందస్తు చర్యలను వేసవిలో తాగు నీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన వివరించారు. 1కోటి 48 మందికి ఉపాది పనులు కల్పించడానికి లక్ష్యంగా నిర్దేశించి 1 కోటి 61 లక్షల మందికి పని కల్పించి ఉపాధి పనుల్లో జిల్లా అగ్రస్థానం లో నిలపడం జరిగిందన్నారు. రూ.737.32 కోట్ల కూలీలకు వేతనాలు చెల్లించడం జరిగిందన్నారు. ఉపాధి కూలీలకు రోజుకి రూ.300 లు నుండి రూ..307లు వేతనం పెంచడం జరిగిందన్నారు. రూ. 20 కోట్ల వ్యయంతో 104 చెక్ డ్యాం మరమ్మతులు చేయడం జరిగిందన్నారు. సాగునీరందుతుందన్నారు. 

మలేరియా నివారణకు ప్రజలకు సహకారం అందించాలని అన్నారు. ఈనెల 15 వ తేదీ నుండి 2086 గ్రామాలలో దోమల మందులు పిచికారీ పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. జ్వరాల పట్ల ప్రజలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో మందులు వినియోగించాలని చెప్పారు. 2030 నాటికి మలేరియా రహిత జిల్లాగా ప్రకటించడానికి ప్రణాళిలు తయారు చేసామన్నారు. ఈ ఏడాది 3 లక్షల 50 వేల దోమ తెరలు పంపిణీ చేయడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు.

👉🏻లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరణ:

లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశించారన్నారు. ఈ ఏడాది 30 వేల ఎకరాల్లో నీడి తోటలు పెంచడానికి అవసరమైన ప్రక్రియ జరుగుతోందన్నారు.

👉🏻మంచి సమస్యల సమాచార కేంద్రాలు ఏర్పాటు:

ఈవేసవి లో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఉన్న మూడు ఐటిడి ఏలలో టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసామని తాగునీటి సమస్యలపై సమాచారం అందిస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. తాగునీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులను ప్రతి రోజు స్వయంగా పర్యవేక్షిస్తామని అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో 1800 425 6828,పాడేరు ఐటిడి ఏ లో 08935250833, రంపచోడవరం ఐటిడి ఏ 619004 252 123 చింతూరు ఐటిడి ఏ లో 81215 29228

సమాచార కేంద్రాల ఫోను నంబర్లకు సమాచారం అందిస్తే 24 గంటల్లో తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

👉🏻18 వేల మంది విద్యార్ధులతో యోగ:

ఈనెల 7 వ తేదీన అరకువ్యాలీ డిగ్రీ కళాశాల మైదానంలో 18 వేల మంది విద్యార్ధులతో 108 సూర్య నమస్కారాల యోగాసనాలు చేసి ప్రపంచ రికార్డు సాధించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లండన్ నుండి యోగా పర్యవేక్షణ బృందం వచ్చి సూర్య నమస్కారాలను పర్యవేక్షిస్తుందన్నారు. యోగాసనాల వలస విద్యార్థుల్లో సామర్ధ్యాలు పెరిగుతాయన్నారు. ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.ఈ

IMG-20250403-WA1117 సమావేశంలో ఐటిడి ఏ ఇంచార్జి పి ఓ డా. ఎం. జె. అభిషేక్ గౌడ, డ్వమా పిడి డా. విద్యా సాగర్, యోగా గురు పతంజలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.