జూలై నెలాఖరుకి తాళ్ళూరు లిఫ్ట్ నుంచి నీరు పారుతుంది

జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ

జూలై నెలాఖరుకి తాళ్ళూరు లిఫ్ట్ నుంచి నీరు పారుతుంది

జగ్గంపేట, పెన్ పవర్, ఏప్రిల్ 4: గండేపల్లి మండలం తాళ్ళూరు లిఫ్ట్ నుంచి జూలై నెలాఖరుకి ఖచ్చితంగా నీరు పారుతుందని పంటలు వేసుకునేందుకు రైతులంతా సిద్ధంగా ఉండాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం గండేపల్లి మండలం మురారిలో ఎమ్మెల్యే నెహ్రూ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గత సీజన్ లో నీరు పంటలకు అందే పరిస్థితి లేక పంటలు వేసుకోవద్దని తేల్చి చెప్పాననన్నారు. అయితే దీనిపై సీఎం చంద్రబాబుతో 15సార్లుకు పైగా మాట్లాడి ఇరిగేషన్ మంత్రితో చర్చలు జరిపానన్నారు. ఇటీవల ఏవరో సోషల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే నెహ్రూ వల్లే తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందని వైసీపీ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉండేదని విమర్శలు చేస్తున్నారని అసలు తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ కి సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటో తెలుసా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించలేదని మాట్లాడుతున్నారని అసలు బడ్జెట్ ఎలా ప్రవేశ పెడతారో కూడా తెలియని వాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. తాళ్ళూరు లిఫ్ట్ పై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నామని ఏదేమైనప్పటికీ జూలై నెలాఖరుకి నీరు పారుతుందని ఎమ్మెల్యే నెహ్రూ స్పష్టం చేశారు.

Tags:

About The Author