సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై సంతలో అవగాహన కల్పించిన ఎంపీడీవో ఉమామహేశ్వరరావు
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 3: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల కేంద్రంలో వారపు సంతలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సింగిల్ యూజ్( ఒక్కసారి వాడి పారేసే )ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై ఎంపీడీవో ఉమామహేశ్వరరావు వర్తకులకు ప్రజలకు అవగాహన కల్పించారు. మైక్ తో ప్రచారం చేయించారు. ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తారీకు నుండి ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ కవర్లను నిషేధించిందని తెలిపారు. సంతల్లో గాని,దుకాణాల్లో గాని వినియోగదారులకు ప్లాస్టిక్ కవర్లను విక్రయించిన, సరుకులతో పాటు ఇచ్చిన అటువంటి వారిపై జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. వినియోగదారులు చేతి సంచులను ఉపయోగించాలని, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వరరావు తో పాటు ఈవోపిఆర్డి పాపారావు, సెక్రటరీ బాలకృష్ణ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.