పార్కింగ్ స్థలం కాదు...రోగులకు వైద్యం అందించే ప్రాంతీయ ఆసుపత్రి

* అడ్డదిడ్డంగా ఆసుపత్రి వద్ద వాహనాలు 

 

* అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఉండని పరిస్థితి 

 

* పట్టించుకోని సంబంధిత అధికారులు 

 

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/చింతపల్లి/గూడెం కొత్తవీధి, పెన్ పవర్,జులై 5: ద్విచక్ర వాహనాలతో కిక్కిరిసి ఉన్న ఈ స్థలం పార్కింగ్ స్థలం కాదు. అక్షరాలు రోగులకు చికిత్స అందించే ఆసుపత్రి.చింతపల్లి, జీ కే వీధి మండలాలకు పెద్దదిక్కు అయిన చింతపల్లి సామాజిక ఆసుపత్రిని ఈ మధ్య కాలంలో ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిగా స్థాయి పెంచారు.పాత బస్టాండ్ కూడలికి ఆనుకుని ఉన్న ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం మలేరియా, ఫైలేరియా, డయోరియా, డెంగ్యూ వైరల్ జ్వరాల వ్యాధిగ్రస్తుల సంఖ్య అధికంగా ఉంది. దానికి తోడు రహదారి విస్తరణ జరిగినప్పటికీ ప్రధాన రహదారికి ఇరువైపులా మురుగు కాల్వల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడం, దోమలు వృద్ధి చెంది ఆసుపత్రికి తరలివచ్చే రోగులకు మరింత జటిలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాల సంఖ్య అధికం కావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది ద్విచక్ర వాహన దారులు ఖాళీగా కనిపించే ఆసుపత్రి ఆవరణను ద్విచక్ర వాహనాలలు, కార్లు పార్కింగ్ స్థలంగా వినియోగిస్తున్నారు. దీంతో ఆసుపత్రి ఆవరణ రోగులు అంబులెన్స్ లు కంటే ద్విచక్ర వాహనాలు, డాక్టర్ కార్లతో ఆస్పత్రి కిటకిట లాడుతుంది. ఈ పరిస్థితి కారణంగా ఆసుపత్రి లోపలకు అంబులెన్స్ లు రావాలన్నా, అత్యవసర రోగులను తీసుకురావాలన్నా, మెరుగైన వైద్యం కోసం మైధాన ప్రాంతం తోపాటు పాడేరు ఆసుపత్రులకు తీసుకు వెళ్ళాలన్నా ఆసుపత్రి ఆవరణంలోకి అంబులెన్స్ వచ్చే వెసులుబాటు లేకపోవడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చింతపల్లి, జీ కే వీధి మండలాల నుంచి అవసరాల నిమిత్తం చింతపల్లి వచ్చే వారికి గ్రామంలో సరైన పార్కింగ్ స్థలం లేక ప్రతీ ఒక్కరూ ఆసుపత్రి ఆవరణంనే పార్కింగ్ స్థలంగా వినియోగిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణంలో ఈ పరిస్థితిని నియంత్రించాలంటే గ్రామంలో వాహనాలకు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని వాహనదారులు, ప్రయాణికులు, ఈ ప్రాంత వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా

IMG-20240705-WA0920
ఆస్పత్రి ఎదురుగా వాహనాల రద్దీ

రు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.