మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌‌కు..! బాంబు బెదిరింపులు..!

bomb-threats-to-medchal-district-collectorate

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌‌కు..! బాంబు బెదిరింపులు..!

మెయిల్‌‌లో బెదిరింపు మెస్సేజ్‌పై అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం..

విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు


సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సిబ్బంది భయాందోళన 


డిసిపి కోటిరెడ్డి ఆదేశాలు.. డాగ్ స్క్వాడ్‌తో  క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు


మొదట కరీంనగర్ ఏరియాకు చెందిన మావోయిస్టు పేరిట మెస్సేజ్‌గా గుర్తింపు


బెదిరింపుల మెయిల్ మెస్సేజ్ తప్పుడు సమాచారంగా పోలీసులు నిర్ధారణ

3

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఏప్రిల్ 3:

బాంబు బెదిరింపుల మెయిల్ మెస్సేజ్‌తో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌‌లో కలకలం రేపింది.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు భయాందోళనతో ఒక్కసారిగా, వివిధ కార్యాలయాల నుండి బయటకు వచ్చారు.. వెంటనే అప్రమత్తమైన అధికారులు, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రుకు తెలియజేశారు.. కలెక్టర్ వెంటనే డిసిపి కోటిరెడ్డికి సమాచారం అందించగా పోలీసులు, బాంబు, "డాగ్ స్క్వాడ్‌" బృందాలు రంగంలోకి దిగారు..

1

జిల్లా సమీకృత సముదాయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి, క్షుణ్ణంగా పరిశీలించారు.. బాంబు బెదిరింపులు తప్పుడు సమాచారంగా నిర్ధారించిన పోలీసులు, విషయాన్ని కలెక్టర్ గౌతమ్‌కు వివరించారు.. అయితే కలెక్టర్ గౌతమ్, తప్పుడు సమాచారం అయినప్పటికీ,  బాంబు బెదిరింపుపై అశ్రద్ధ వహించకూడదని పోలీసులకు సూచించారు.. తదుపరి విచారణ కొనసాగించాలని డిసిపి కోటిరెడ్డిని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు..

24

About The Author