#
#CONGRESS #DELHI #POLITICS #NATIONALPOLITICS #TRENDINGNWEWS #NEWS
జాతీయం / National  పాలిటిక్స్ 

కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్

కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే ప్రేమ లత మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు దశాబ్దం తర్వాత ఆయన తిరిగి సొంత గూటికి చేరారు. బీరేందర్ సింగ్ కుమారుడు బ్రిజేంద్ర సింగ్ బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన నెలరోజుల తర్వాత తండ్రి కూడా అదే పార్టీలో చేరిపోవడం విశేషం. రైతు నాయకుడు సర్ చోటూ రామ్ మనవడైన బీరేందర్ సింగ్(78) 2014లో కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరారు.
Read More...

Advertisement