అగంతకుల చేతిలో సిల్వర్ మరియు జాప్ర మొక్కలు అగ్నికి ఆహుతి:నష్టపోయిన యువరైతు చెదల శశికాంత్
గూడెం కొత్తవీధి,పెన్ పవర్ ఏప్రిల్1:ప్రకృతి పరిరక్షణ కొరకు మొక్కలు నాటాలి, చెట్లను పెంచాలి అని ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తూ ఉంది. అలాగే గిరిజన ప్రాంతంలో రైతులు అధిక శాతం మంది ఉద్యానవన పంటలు, కాఫీ మిరియాల తోటల పెంపకానికై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం కూడా అటువంటి రైతులను ప్రోత్సహిస్తుంది. కానీ ఎండాకాలం వచ్చిందంటే కాఫీ తోటలు, సిల్వర్ తోటలు ఉన్న రైతుల కంటిమీద కునుకు లేకుండా పోతుంది. కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా అగ్గిలైన్లు చేసుకున్న కొంతమంది అగంతకుల కారణంగా తోటలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మండలంలో వంచుల పంచాయితీ చామగడ్డ గ్రామానికి చెందిన యువరైతు చెదల శశికాంత్ ఆరు సంవత్సరాల క్రితం ఎంతో కష్టపడి మూడు ఎకరాల తన భూమిలో సిల్వర్ మరియు జాప్రా మొక్కలను నాటారు. చెట్లు ఎదగటంతో కాఫీ మొక్కలను నాటారు.
అయితే మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు మంట పెట్టటంతో తోట మొత్తం కాలిపోయింది.తోట ఎదుగుదలకు వచ్చింది అని ఆశపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా అగ్నికి ఆహుతి అవటంతో రైతు కన్నీటి పర్యంతమయ్యారు. పంట నష్టపోయిన రైతుకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.