రేషన్ కార్డుదారులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి:తహసీల్దార్ టి.రామకృష్ణ

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 02:మండలంలో రేషన్ కార్డుదారులందరూ ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని గూడెం కొత్తవీధి మండల తహశీల్దార్ టీ.రామకృష్ణ వెల్లడించారు.బుధవారం రింతాడలో తహశీల్దార్ కార్డుదారులకు దగ్గరుండి ఈ కేవైసీ చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31 లోగా కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈ కేవైసీ చేయించుకోవాలని లేకపోతే బియ్యం పంపిణీ నిలిచిపోయే అవకాశం ఉందని తెలియజేశారు.ఇక గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వీఆర్వోలు ఇంటింటికి వెళ్లి ఈ కేవైసీ చేస్తున్నారన్నారు.రేషన్‌ షాపులు, మీసేవ,ఆధార్‌ కేంద్రాల్లోనూ ఈ కేవైసీనీ నమోదు చేయించుకోవచ్చని స్పష్టం చేశారు.ముఖ్యంగా ఒకటవ తరగతి నుండి 5వ తరగతి లోపు పిల్లలకు ఈ కేవైసీ పెండింగ్ ఉందని వారికి ఆధార్‌ కేంద్రాల్లో అప్‌డేట్‌ చేస్తే సరిపోతుందని వివరించారు. ఎండియు,వీఆర్వో, సచివాలయం వద్ద ఈ కేవైసీ చేయించుకునేటప్పుడు ఈపాస్ యంత్రంలో ఆకుపచ్చ రంగు సూచిస్తే ఈ కేవైసీ అయినట్టు అని గులాబీ రంగులో చూపిస్తే ఈ కేవైసీ కానట్టుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో సురకత్తి కృష్ణారావు,ఎండియు కంకిపాటి నారాయణ,రేషన్ డీలర్ ఖఘుపతి, రింతాడా ఉప సర్పంచ్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు

IMG-20250402-WA1285 .

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.