గూడెం కొత్తవీధిలో శ్రీరామనవమి ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ: ఉత్సవ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు గొర్లె వీర వెంకట్, ముక్కలి రమేష్  

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 30:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధిలో ఏప్రిల్ ఆరవ తేదీ నుండి జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు గొర్లె వీర వెంకట్ తెలిపారు.స్థానిక ఎంపీటీసీలు రీమేల రాజేశ్వరి,పసుపులేటి నాగమణి, మాజీ సర్పంచ్ పసుపులేటి రామకృష్ణ,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ముక్కలి రమేష్,ఉత్సవ కమిటీ ప్రతినిధులు రేమలపాల్,సుర కత్తి లక్ష్మణ్,ముక్కలి మృదుభాషిణి గొర్లె కళావతి,ముక్కలి వెంకటరావు,మహేష్ ల సారాధ్యంలో గోడ పత్రికను ఆవిష్కరించామని తెలిపారు. గూడెం గ్రామంలో ఏప్రిల్ ఆరవ తేదీ నుండి 9వ తేదీ వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఆరవ తేదీ ఆదివారం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.IMG-20250330-WA1298  అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.