పరిశీలన అనంతరం 12 మంది అభ్యర్ధులు

పరిశీలన అనంతరం 12 మంది అభ్యర్ధులు

గంగవరం అల్లూరి జిల్లా

IMG-20240426-WA0113

గంగవరం/
రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 26: 

 రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 17 మంది అభ్యర్ధులు దాఖలు చేసిన 26 నామినేషన్ నామినేషన్ పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగిందని 53 రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ  రిటర్నింగ్ అధికారి యస్.  ప్రశాంత్ కుమార్ తెలిపారు.  శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్  కార్యాలయ సమావేశపు హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో  17 మంది అభ్యర్థుల  నామినేషన్ పత్రాలను పరిశీలన చేయడం జరిగిందని,  నిభంధనల ప్రకారం ఉన్న 12 మంది అభ్యర్ధుల నామినేషన్లను ఆమోదించడం జరిగిందని, మిగిలిన ఐదుగురి నామినేషన్లను తిరష్కరించడం జరిగిందని వివరించారు. 

 

ఆమోదించబడిన నామినేషన్లు 

 కాకూరు కన్నం రెడ్డి  బహుజన  సమాజ్ పార్టీ,  నాగులపల్లి ధనలక్ష్మ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైసిపి, మిరియాల శిరీష దేవి తెలుగుదేశం పార్టీ,  లోత రామారావు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా,  (మార్కిస్ట్ )  , దుమంతు విశ్వనాథం రిపబ్లికాన్ పార్టీ ఆఫ్ ఇండియా,
మద్దేటి అంజిరెడ్డి భారత ఆదివాసి పార్టీ,
మానుపూడి సుబ్బారావు  పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, కుంజ శీను స్వతంత్ర అభ్యర్థి, పల్లాల లచ్చిరెడ్డి  స్వతంత్ర అభ్యర్థి, పాలడుగు లక్ష్మీప్రసన్న స్వతంత్ర అభ్యర్థి,  పాలడుగు శ్రీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థి, బంగారు వెంకటేష్ స్వతంత్ర అభ్యర్థి.


తిరష్కరించబడిన నామినేషన్లు

 ఇద్దరు స్వతంత్ర  అభ్యర్థులు కుంజం వీర వెంకట సత్య నారాయణమ్మ,  తుర్రం అశోక్ కుమార్ నామినేషన్ పత్రాలు పూర్తిస్థాయిలో సకాలంలో సమర్పించనందున తిరస్కరించడం జరిగిందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.  అదేవిధంగా పూనేం సత్యనారాయణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్ ) పార్టీ దమ్మి అభ్యర్థి, మిరియాల  లోవలక్ష్మి తెలుగుదేశం డమ్మీ అభ్యర్థి, బొడ్డపాటి రాఘవ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థుల  నామినేషన్ పత్రాలను తిరస్కరించబడినవని,  పార్టీ గుర్తులతో  బి ఫారం లు సమర్పించిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఆమోదించడం వలన ముగ్గురు డమ్మీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించడం జరిగిందని ఆయన వివరించారు. 

 

IMG-20240426-WA0111


ఈ కార్యక్రమంలో  అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎ. జ్యోతి కృష్ణ,  తాహసిల్దార్లు నాగరాజు, ఏవి రమణ, సత్య సులోచన, సత్యనారాయణ, చలపతిరావు, నాగమణి, డిప్యూటీ తహల్దారులు యన్ వి వి సత్యనారాయణ,బి. రాజు,శివ చైతన్య, విశ్వనాధ్, శ్రీధర్, బాలాజీ, సత్యనారాయణ, మూర్తి, రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్లు లక్ష్మణ్, పాల్ బాబు  వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author