రక్తదానం చేయడానికి ముందుకు రావాలి : తాసిల్దార్ శ్రీనివాస్ రావు
tasildar-srinivas-rao-should-come-forward-to-donate-blood
By D. RATNAM
On
గంగవరం, పెన్ పవర్, ఫిబ్రవరి 15:
ఈనెల 18న రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించ తలపెట్టిన రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని గంగవరం తాసిల్దార్ సిహెచ్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సొసైటీ మహా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలోనూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి రక్తదానం చేసేందుకు యువత ముందుకు వచ్చేలాగా ప్రయత్నించాలని ఆయన సిబ్బందికి సూచించారు.