మండల మహిళా సమాఖ్య ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్
pure-andhra-pure-divas-in-the-womens-federation-premises
By D. RATNAM
On
గంగవరం, పెన్ పవర్, ఫిబ్రవరి 15:
స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శనివారం గంగవరంలోని మండల మహిళా సమైక్య కార్యాలయం ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. వెలుగు ఏపీఎం షణ్ముఖరావు, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలుస చిన్నారి సమైక్య కార్యవర్గ సభ్యులు వెలుగు సిబ్బంది కార్యాలయం ఆవరణ లోని తుప్పలను నరికి పరిసరాలను పరిశుభ్ర పరిచారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది గంగారత్నం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.