రేపు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాడేరు పర్యటన
జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్
స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 09: రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ, గిరిజన శాఖామాత్యులు గుమ్మిడి సంద్యారాణి ఈ నెల పదవ తేదీ(బుధవారం)న జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ తెలిపారు.ఆమె పదవ తేదీ బుధవారం ఉదయం 06.30 గంటలకు సాలురులో బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 11.00 గంటలకు పాడేరు చేరుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమావేశంలో పాల్గొంటారు.అనంతరం మ. 02.10 గంటలకు పాడేరు ఐటిడిఎ గెస్ట్ హౌస్ నందు టిడిపి నాయకులతో సమావేశమవుతారు. అనంతరం సా.04.00 గం.లకు పాడేరు నుండి విశాఖపట్నంకు బయలుదేరి వెళతారు అని తెలిపారు.

About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.