ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చట్రపల్లి క్షతగాత్రులకు పరామర్శించిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు
స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,సెప్టెంబర్ 14 :పాడేరు నియోజకవర్గం జీ.కే వీధి మండలం చట్రపల్లి వరద బాధిత క్షతగాత్రులకు శాసన సభ్యులు మత్స్య రాస విశ్వేశ్వర రాజు మంగళవారం విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ లో వార్డులకు వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థుతులు గురించి వైద్యులకు అడిగి తెలుసుకున్నారు.చికిత్స పొందుతున్న ఐదుగురు క్షతగాత్రులకు తన సొంత నిధులతో ఆర్థిక సహాయం అందజేసి భరోసా ఇచ్చారు. వైద్యులతో మాట్లాడుతూ క్షతగాత్రులకు ప్రత్యేక చొరవ తీసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు.అనంతరం కే.జి.హెచ్ బయట విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏజెన్సీలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు.గూడెం కొత్తవీధి మండలం చట్రపల్లి, నిమ్మచెట్టు, మాదిగ మళ్ళు తదితర గిరిజన గ్రామాలు ఇటీవల సంభవించిన వరదలతో పూర్తిగా అతల కుతలం అయిందని గిరిజనులు పూర్తిగా నిరాశ్రయులయ్యారని నేటికీ వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు.మైదాన ప్రాంతంలో ఏ చిన్నపాటి సంఘటన జరిగినా వేగంగా స్పందించే అధికారులు గిరిజన ప్రాంతాల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని దీంతో గిరిజనులకు న్యాయం జరగటం లేదన్నారు.చట్రపల్లి భాదితులు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నప్పటికీ నేతికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరు వెళ్లి పరామర్శించకపోవడం విచారకరమన్నారు. బాధితులకు నేటికీ పైసా పరిహారం కూడా అందకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. చట్రపల్లి బాధితులకు వైఎస్ఆర్సిపి తరఫున ఇప్పటికే నిత్యవసర సరుకులు బట్టలు తదితర సామాగ్రి అందజేయడం జరిగిందన్నారు.త్వరలోనే నిమ్మచెట్టు, మాదిమల్లు గ్రామాల గిరిజనులకు కూడా పార్టీ తరఫున ఆదుకుంటామన్నారు.ఆయన వెంట వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి కూడా సురేష్ కుమార్, నాయకులు కూడా సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు
.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.