పంచాయతీ అధికారులు పట్టించుకోరు:అరికట్ట అంజి
స్వచ్ఛందంగా చెత్త తొలగిస్తున్న గ్రామస్తులు
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జులై 17: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం జీకే వీధి పంచాయతీ ఆర్ వి నగర్ గ్రామంలో చెత్త తొలగింపు కార్యక్రమాలను పంచాయతీ అధికారులు చేపట్టటం లేదని, వర్షాల కారణంగా దోమలు వ్యాప్తి చెంది వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున దోమల నివారణ కొరకు ఫోగ్ కొట్టటం కూడ లేదని మండల వైసీపీ నాయకులు అరికట్ట అంజి తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా గ్రామస్తులు చెత్తను తొలగించుకుంటున్నారు. ఈ సందర్భంగా వర్షాకాలం కావున వ్యాధులు సంక్రమించే అవకాశం అధికంగా ఉందని కావున పంచాయతీ అధికారుల స్పందించి గ్రామంలో బ్లీచింగ్ వేయించాలని,ఎప్పటికప్పుడు క్లాప్ మిత్రులచే చెత్తను తొలగించాలని అంజి అన్నారు.
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.