స్ట్రాంగ్ రూమ్ కు చేరిన ఈవీఎంలు వివి ప్యాడ్లు 

స్ట్రాంగ్ రూమ్ కు చేరిన ఈవీఎంలు వివి ప్యాడ్లు 

గంగవరం ,రంపచోడవరం( అల్లూరి జిల్లా)

 

IMG-20240415-WA0076

 త్వరలో జరగబోవు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు. వివి ప్యాడ్లు  పాడేరు నుంచి వచ్చిన వాటిని  వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో  స్ట్రాంగ్ రూములో  భద్రపరచడం జరిగిందని  53 రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ  రిటర్నింగ్ అధికారి  యస్. ప్రశాంత్ కుమార్ తెలిపారు.                                సోమవారం స్థానిక గిరిజన  బాలురు  వసతి గృహం ప్రాంగణంలో పాడేరు నుండి రంపచోడవరం వచ్చిన ఈవీఎంలు. వివి పాడ్లు  రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో అరకు పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలు. వి వి ప్యాడ్లు  రెండు కంటైనర్ల లో  వచ్చిన వాటిని వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులతో రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ  రిటర్నింగ్ అధికారి యస్. ప్రశాంత్ కుమార్ రంపచోడవరం, అడిషనల్ ఎస్పీ జగదీష్ సమక్షంలో కంటైనర్లలో వచ్చిన  ఈవీఎంల. వివి పేడ్ల  రెండు వాహనాలలో  వచ్చిన ఈవీఎంలు. వివి ప్యాడ్ వాహనాల  శీలులను   ఓపెన్ చేసి స్ట్రాంగ్ రూములలో భద్రపరచడం  జరిగింది.  ఈ సందర్భంగా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ   రిటర్నింగ్ అధికారి  యస్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అరకు పార్లమెంటుకు సంబంధించిన   11 మండలాలలో 399 పోలింగ్ కేంద్రాలకు గాను  518  ఈవీఎంలు. 518  వివి ప్యాడ్లు. 518 బ్యాలెట్ యూనిట్ . 518  కంట్రోల్ యూనిట్లు ఈ నియోజకవర్గానికి  రావడం జరిగిందని ఆయన తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఈవీయంలు. వివి ప్యాడ్లు  ప్రతిష్టాత్మకమైన భద్రతతొ స్ట్రాంగ్ రూమ్ దగ్గర  ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.  ఈవీఎంల. వివి ప్యాడ్ల  స్ట్రాంగ్ రూమ్ పరిధిలో  పరిధిలో ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ  ఎవరికి అనుమతి ఉండదని ఆయన తెలిపారు . అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన  ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూములో భద్రపరిచి సీల్ వేయడం జరిగింది,    

 

 

               ఈ కార్యక్రమంలో తాహసిల్దారు  ఎ.కృష్ణ జ్యోతి,  డిప్యూటీ తాహసిల్దార్లు ఎన్ వివి సత్యనారాయణ, బి. రాజు, చైతన్య, శ్రీధర్, విశ్వనాథం, శివ, సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. వెంకటేశ్వరరావు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పి. శ్రీనివాసరావు,కె. బాలకృష్ణ, చుక్క. సంతోష్ కుమార్ , కృష్ణారెడ్డి సీనియర్ సహాయకులు టి. లక్ష్మణరావు, ఇందిరా బాయ్, పాలు బాబు,వీఆర్వోలు,గణపతి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు .

Tags:

About The Author