సిమెంట్ రోడ్లు వేశారు బెర్ములు మరిచారు

సిమెంట్ రోడ్లు వేశారు బెర్ములు మరిచారు

 వై రామవరం

లక్షలాది రూపాయల ప్రజా ధనంతో సిమెంట్ రోడ్లు నిర్మించారని, బెర్ములు మరిచారని స్థానికుల ఆరోపిస్తున్నారు.

గడప గడపకు వైఎస్ఆర్సిపి కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీకి 40 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని ఆయా సర్పంచులు తెలిపారు. సిమెంట్ రోడ్లన్నీ నిర్మించా రని,బెర్ములను మరిచారని, దీనివల్ల ప్రమాదాలు సంభవించే పరిస్థితులు ఉన్నాయని స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు,ఇంజనీరింగ్ అధికారుల కను సన్నలలోనే ఈ అసంపూర్తి నిర్మాణాలు జరిగాయని స్థానికుల ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి అసంపూర్తి  నిర్మాణాలను పూర్తి చేయించగలరని స్థానికులు కోరుతున్నారు.

Tags:

About The Author