జిల్లాలో మొట్టమొదటిగా రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ పోటీలు ఓకేనా
జిల్లాలో మొట్టమొదటిగా రాష్ట్రస్థాయి చెస్ పోటీలు.
రాష్ట్రస్థాయి చెస్ అసోసియేషన్ సెక్రెటరీ కవుది జగదీష్ ఆధ్వర్యంలో.
అమలాపురం, టౌన్ పెన్ పవర్, నవంబర్ 10:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటి సారి గా 2024వ సంవత్సరం లో ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ తో రాష్ట్రస్థాయి చెస్ అసోసియేషన్ సెక్రటరీ కవురి జగదీష్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ కిమ్స్ ఆడిటోరియంలో జరిగే చెస్ పోటీలను అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ప్రారంభించారు. జిల్లాలో రాష్ట్రస్థాయిలో జరిగే చెస్ టోర్నమెంట్ కు 24 జిల్లాల నుండి సుమారుగా 200 మంది క్రీడాకారులు కి పైగా పాల్గొనగా ఈ పోటీలలో జాతీయ స్థాయి క్రీడాకారులు, రాష్ట్రపతి అవార్డు పొందిన క్రీడాకారులు, ఈ చెస్ పోటీలలో పాల్గొన్నారు
ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధూర్ చే ట్రోపీ మరియు ప్రైజ్ మనీ అందించారు.
ఈ సందర్భంగా ఎంపీ హరీష్ బాలయోగి మాట్లాడుతూ
క్రికెట్, చెస్, స్విమ్మింగ్ ఇతర క్రీడాకారులను ప్రోత్సహించడానికి అన్ని విధాల కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ నాయకులు,అధికారులతోనూ మాట్లాడతానని తగిన విధంగా రాబోయే రోజుల్లో క్రీడాకారులు అన్ని విధాలుగా వసతులు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర దేశాలకు పంపించి మన దేశంలో క్రీడాకారులు తలెత్తుకునేలా చేస్తామని ఎంపీ తెలిపారు
అలాగే కవురు జగదీష్ మాట్లాడుతూ
అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి మరియు కిమ్స్ యాజమాన్యం వారి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించామని ఎంపీ హరీష్ మాధుర్ కి , కిమ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు పిలవగానే వచ్చి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావుకి మెట్ల రమణబాబు కి కూడా కృతజ్ఞతలు తెలిపారు అన్ని జిల్లాల నుంచి క్రీడా పోటీలకు విచ్చేసిన క్రీడాకారులకు మరియు తల్లిదండ్రులకు సహకరించిన అందరికీ జగదీష్ కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కె వి బి శర్మ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అసోసియేషన్ సెక్రటరీ తాడి సురేష్, చెస్ అసోసియేషన్ సీఈవో జ్వాలాముఖి, అసోసియేషన్ మెంబర్ ముషిణి మురళీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.