ఎస్టి.రాజపురంలో ఆరోగ్య సురక్ష శిబిరం
By Admin
On
రంగంపేట
మండలంలోని ఎస్టీ.రాజపురం గ్రామంలో శుక్రవారం ఆరోగ్య సురక్ష శిబిరాన్ని డాక్టర్ కె.చిన్నారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో 325 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పలువురికి కంటి పరీక్షలు నిర్వహించి తగు మందులు అందించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఇద్దరినీ (ఆరోగ్యశ్రీ నెట్వర్క్)జిజిహెచ్ రాజమహేంద్రవరం హాస్పిటల్ కి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎముకల వైద్య నిపుణుడు డాక్టర్ సిహెచ్.శ్రీ హర్ష,చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ జి.లక్ష్మి రసజ్ఞ, కంటి వైద్య నిపుణులు ఎం.ఇందిరా , వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, 104 సిబ్బంది, ఆశా కార్యకర్తలు, సచివాలయం సిబ్బందితదితరులు పాల్గొన్నారు.
Tags: