మన్నవ ఆధ్వర్యంలో 16వ వార్డులు ప్రజల హా ర్షద్వానాల మధ్య విస్తృత ప్రచారం.
కావలి
కావలి పట్టణంలో 16 వార్డులు నాలుగువ క్లస్టర్ ఇంచార్జ్ మరియు నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్లు కమ్మిశెట్టి రమణయ్య నేలపాటి మాల్యాద్రి, కోఆర్డినేటర్ మస్తాన్ నాయకత్వంలో శనివారం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు.వార్డు ప్రజలు హర్షద్వానాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడుతున్న సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు. అనంతరం మన్నవ రవిచంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస పాలన పారద్రోలి రామరాజ్యాన్ని తీసుకురావాలని, రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు మార్పును కోరుతున్నారని, ప్రతి ఒక్కరు కూడా కావలి ఎన్డీఏ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్ డి ఏ ఉమ్మడి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.