తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే

తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే

కావలి పెన్ పవర్ నవంబర్ 12  తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కావలి నియోజకవర్గం ప్రజలు 12,13,14 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కావలి నియోజకవర్గం ప్రజలందరూ తుఫాన్ తీవ్రత పట్ల అవగాహన కలిగియుండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, తుఫాను సమయంలో తీవ్రమైన పెనుగాలులు ఇచ్చే అవకాశం పిడుగులు పడే ప్రమాదం ఉంది కాబట్టి పశువుల కాపరులు,రైతులు,మరి ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లులు, వయో వృద్దులు ఇల్లు విడిచి బయటకు రావద్దన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది గ్రామ సచివాలయం వద్ద అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కావలి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే విధంగా సచివాలయ ఉద్యోగులు, టిడిపి పార్టీ నేతలు సిద్దంగా ఉండాలని కోరారు

Tags:

About The Author