జరిమానా భరించడం కంటే హెల్మెట్ ధరించడం మేలు

జరిమానా భరించడం కంటే హెల్మెట్ ధరించడం మేలు

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. భారతి వెల్లడి..

స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్ ఒంగోలు జులై18: 

జరిమానా భరించడం కంటే హెల్మెట్ ధరించడం మేలని, సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. భారతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల ప్రకారం గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం అనే అంశం మీద జరిగిన అవగాహన ర్యాలీ ప్రారంభిస్తూ న్యాయమూర్తి మాట్లాడారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల న్యాయ సేవ అధికారి కమిటీల్లోను మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని సమాజంలో ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని తద్వారా రాబోయే ప్రమాదాలను నివారించవచ్చని, అలసత్వంతో కూడిన వాహన ప్రయాణం వలన ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చని వీటిని నివారించడానికి ప్రతి ఒక్కరూ వాహనంలో వెనక కూర్చున్న వారితో పాటు హెల్మెట్ ధ5 రించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి డి.అమ్మన్నరాజా,పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ నరసింహ రాజు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు, అడిషనల్ ఎస్పీలు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, న్యాయవాదులు, ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల విద్యార్థులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

About The Author