పొదిలిలో కుష్టు నివారణ సర్వే కార్యక్రమం
By Admin
On
పొదిలి, వెన్ పవర్ జూలై 18:
పొదిలిలో గురువారం నాడు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కుష్టు నివారణ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పొదిలి ప్రభుత్వ వైద్యులు శరత్ చంద్ర నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పొదిలి పట్టణంలోని ఒకటవ సచివాలయం పరిధిలోగల తూర్పు పాలెం లో ప్రభుత్వ వైద్యులు శరత్ చంద్ర, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు అలాగే కుష్టు వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాల గురించి వివరించారు కుష్టు నివారణ సర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల రెండో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వైద్యులు శరత్ చంద్ర తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్ చంద్ర తో పాటు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు