25 మంది గర్భవతులకు వైద్య పరీక్షలు.

25 మంది గర్భవతులకు వైద్య పరీక్షలు.

స్థానిక మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు వైద్యపరీక్షలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మారుతీరావు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 25 మంది గర్భవతులకు డాక్టర్ సభిహాసుల్తానా వైద్య
పరీక్షలు నిర్వహించి,  అవసరమైన వారికి మందులను అందజేశారు. 
అందులో ముగ్గురికి హెచ్.బీ శాతం తక్కువ ఉన్న కారణం వలన వారికి ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ లు ఇవ్వడం జరిగినదని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. అనంతరం గర్భవతులు అందరినీ సమావేశ పరచి ఆరోగ్య విద్యను బోధించడం జరిగినదన్నారు. వారికి 
మజ్జిగ పాకెట్స్, వేరుశనగ ముద్దలు కూడా ఇవ్వడం జరిగినదన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ భాస్కరరావు, పీ.హెచ్.ఎన్ వరలక్ష్మి,  ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎం లు,  ఎం.ఎల్.హెచ్.పీ లు , ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

About The Author